అమ్మాయి అందాన్ని ఇచ్చే వాటిల్లో జుట్టు ఒక‌టి. ఒత్తైన జుట్టు కావాల‌ని ప్ర‌తి ఒక్క‌రు కోరుకుంటారు. కానీ జీవ‌న‌శైలి, ఒత్తిడి, నిద్రలేమి ఇలా అనేక కార‌ణాల వ‌ల్ల జుట్టు ఎక్కువ‌గా ఊడిపోతుంటుంది. మ‌రియే ఈ మొడ్ర‌న్ ప్ర‌పంచంలో అనేక ర‌కాల హెయిర్ స్టైల్స్ కోసం జుట్టు క‌త్తిరించేసుకుంటున్నారు. 


అయితే కొంత మందికి జుట్టు మీద మ‌క్కువ ఎక్కువ‌గా ఉన్నా వారికి అధికంగా జుట్టు రాలిపోతుంటుంది. అలాంటి వారు జుట్టు నేచురల్ గా మందంగా, మంచి షైనింగ్ తో కనిపించాలంటే జుట్టుపై ప్ర‌త్యేక శ్ర‌ద్ధ మ‌రియు ఆహార అల‌వాట్లు మార్చ‌కుంటే స‌రిపోతుంది. మ‌రి అవేంటో ఓ లుక్కేయండి..


- గుడ్డులో అధిక ప్రోటీన్లు ఉంటాయి. దీనిని మ‌న ఆహారంలోనే గాక జుట్టును సంర‌క్షించుకోవ‌డానికి కూడా ఉప‌యోప‌డుతుంది. ఎగ్‌వైట్‌ను తీసుకుని డైరెక్ట్‌గా జుట్టుకు అప్లై చేసుకుని.. కొంత స‌మ‌యం త‌ర్వాత త‌ల‌స్నానం చేస్తే మంచి ఫ‌లితం ఉంటుంది.


- క‌ల‌బంద వ‌ల్ల క‌లిగే ప్ర‌యోజ‌నాలు అన్నీ ఇన్నీ కావు. ఈ క్ర‌మంలోనే క‌ల‌బంద జ‌ల్‌ను కేశాల‌ను అప్లై చేసుకోవాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల జుట్టు రాల‌డం త‌గ్గి ఒత్తైన మ‌రియు న‌ల్లిటి శిరోజాలు సొంతం చేసుకోవ‌చ్చు.


- మ‌న ఆహారంలో ఐర‌న్‌, ప్రోటీన్‌, ఒమేగా-3 ఫాటీ ఆసిడ్‌, విట‌మిన్-ఎ మ‌రియు జింక్ ఉండేలా చూసుకోవాలి. వీటి వ‌ల్ల‌ మ‌న జుట్టు పెరుగుద‌ల‌కు బ‌రియు దృడ‌త్వానికి బాగా ఉప‌యోగ‌ప‌డ‌తాయి.


- కొన్ని ఎండు ఉసిరికాయలని కొబ్బరి నూనెలో మరిగించి వడగట్టుకోవాలి. ఈ నూనెతో శిరోజాల‌పై మృదువుగా మసాజ్ చేసుకోవాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల ఉసిరిలో ఉండే ఈ గుణాలు తలను ఆరోగ్యంగా మరియు జుట్టు పెరుగుదల అధికం చేస్తాయి. 


- ఉల్లిపాయలను మిక్సీలో పేస్ట్ చేసి అలా వచ్చే రసాన్ని నేరుగా తలకు పట్టించడం వల్ల జుట్టు పెరుగుదల మరియు దృడంగా మెరుగుపడుతుంది.


- రోజుకు ఖ‌చ్చితంగా 8గంటలు నిద్ర తప్పనిసరిగా ఉండాలి. ప్రతి రోజూ సరైన నిద్రను పొందడం వల్ల జుట్టు ఆరోగ్యంగా మ‌రియు ఒత్తుగా పెరుగుతుంది.


- మూడు రోజుల‌కు ఒక సారి ఖ‌చ్చితంగా త‌ల‌స్నానం చేయాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల త‌ల‌పై ఉన్న డ‌స్ట్ పార్టిక‌ల్స్ తొలిగి జుట్టు హెల్తీగా పెరుగుతుంది.



మరింత సమాచారం తెలుసుకోండి: