స‌హ‌జంగా చుండ్రు మృత చర్మం వలన తయరవుతుంది. ఈ కాలంలో చుండ్రు అనేది సర్వసాధారణంగా కనిపించే సమస్య. చాలా మంది వేడినీటితో తల వెంట్రుకలను కడగటం వల్ల తలపై చర్మం పొడిగా మారుతుంది. మృత చర్మం రోజంతా తెల్లని పొడి రూపంలో శరీరంపై రాలుతుంటుంది. వేడి ఉండే వాతావరణంలో ఎక్కువ సేపు గడపడం,  ఒత్తిడి, పోషకాహార లోపం వంటి అనేక కారణాల వల్ల కూడా మనలో చాలా మందికి చుండ్రు సమస్య వస్తుంటుంది. 


పోషకాహార లోపం ఏర్పడకుండా సంతులిత ఆహారాన్ని తీసుకోవాలి. అలాగే నిద్రలేమి వ‌ల్ల వ‌చ్చే ఒత్తిడి కూడా చుండ్రు రావ‌డానికి కార‌ణం. చలికాలంలో అయితే ఈ సమస్య మరింత ఎక్కువగానే ఉంటుంది. అయితే దీని నివార‌ణ‌కు సులువైన చిట్కాలు పాటిస్తే స‌రిపోతుంది. మ‌రి అవేంటో ఓ లుక్కేయండి..


- జుట్టుకు కండిషనర్ మందార ఆకులు మరియు పువ్వు రేకులను పేస్ట్ చేసి జుట్టుకు ఒక సహజ కండీషనర్ వలె ఉపయోగిస్తారు. జుట్టు న‌ల్ల‌ రంగులో మారటానికి మరియు చుండ్రు తగ్గించడానికి సహాయపడుతుంది.


-  మెంతి ఆకును దంచి పేస్ట్ లా చేసి తలకు రాస్తే చుండ్రు, వెంట్రుకలు రాలడం తగ్గుతాయి. వెంట్రుకలు నిగనిగలాడతాయి.


- తలస్నానం చేసే నీళ్ళు పరిశుభ్రంగా ఉండాలి. పొగలు కక్కే వేడినీటిని కానీ.. మరీ చన్నీటిని కానీ.. తల స్నానానికి
ఉపయోగించకూడదు. గోరువెచ్చని నీటిని మాత్రమే తలస్నానానికి ఉపయోగించాలి.


- చుండ్రు సమస్యతో సతమతమయ్యేవారు పెరుగులో కొంచెం ఉసిరికాయ పొడి కలిపి తలకి పట్టించి అరగంట తర్వాత స్నానం చేస్తే మంచి ఫలితాలు వస్తాయి.


- తలలో చుండ్రు ఏర్పడితే తాజా వేపాకులను మెత్తగా నూరి.. ఆ ముద్దను తలకు పట్టించి కొంత స‌మ‌యం తర్వాత తలస్నానం చేయాలి. ఆ విధంగా తలస్నానం చేస్తే వెంట్రుకల చుండ్రు తొలగిపోయి తల శుభ్రంగా ఉంటుంది.


- పుదీనా రసం త‌ల‌కు పట్టించి అరగంట తర్వాత తలని శుభ్రపరిస్తే చుండ్రు సమస్య ఉండదు.


- కొద్దిగా గసగసాల‌ను తీసుకొని, సన్నని మంట పై వేయించి, కొద్దిగా గోరువెచ్చటి నీటి లో 4 నుండి 5 గంటలు నానబెట్టి ఆ మిశ్రమాన్ని,తలకు పట్టించాలి. కొంత స‌మ‌యం త‌ర్వాత తల స్నానం చేయ‌డం వ‌ల్ల మంచి ఫ‌లితం ఉంటుంది.


- రెండు టేబుల్ స్పూన్ల మెంతులు తీసుకొని నీటి లో వేసి రాత్రి మొత్తం నానపెట్టి, ఉదయం ఆ మిశ్రమాన్ని పేస్ట్ లాగా చేసి తలకి పట్టించి అరగంట తర్వాత స్నానం చేయ‌డం వ‌ల్ల చుండ్రు స‌మ‌స్య త‌గ్గుతుంది.


మరింత సమాచారం తెలుసుకోండి: