మద్యం సేవించే వారిలో కొందరు అనూహ్యంగా లావెక్కుతుంటారు. అందుకు కారణం మద్యం మత్తులో వారు మస్తుగా తినడమేనని తాజా ప‌రిశోధ‌న‌ల్లో వెల్ల‌డైంది. మందు తాగేట‌ప్పుడు మద్యంలో కాలరీలు, తీసుకునే ఆహారంలో కాలరీలు ఉండడం వల్ల కాలరీలు ఎక్కువై లావు అవుతారట‌. మద్యం తాగేవారు ఎందుకు లావెక్కుతారో మొదటి సారి శాస్త్రీయ కారణాన్ని కనుగొన్నారు. మ‌ద్యం మ‌న‌శీర‌రంలోకి ఎంట్రీ ఇవ్వ‌గానే దానిని ఓ విష‌ప‌దార్థంగా కాలేయం గుర్తిస్తుంద‌ట‌.


వెంట‌నే అందులోని కాల‌రీలు క‌రిగించి... దాని అంతు చూడాలని భావించి.. అందుకు ప్రాధాన్యత ఇస్తుంది. మ‌ద్యంలో కాల‌రీలు క‌రిగించేందుకు ట్రై చేస్తూ ఆహార రూపంలో వ‌చ్చే కాల‌రీల‌ను పూర్తిగా వ‌దిలేస్తుంది.. ఇంకా చెప్పాలంటే నిర్ల‌క్ష్యం చేస్తుంది. దీంతో మన శరీరంలో ఆహారం తాలూకు కాలరీలు కొవ్వు రూపంలోకి మారి స్థిర పడుతుంది అని లండన్‌కు చెందిన డాక్టర్‌ జో హార్కాంబే, డాక్టర్‌ సారా బ్రీవర్‌ చెప్పారు.


మద్యంలోని కాలరీలను కరగించడం కూడా మనిషిలోని కాలేయం శక్తి మీద ఆధారపడి ఉంటుందని, మద్యం కాలరీలు మరీ ఎక్కువై, కాలేయం శక్తి అంతగా లేకపోతే మద్యంలోని కాలరీలు కూడా మిగిలి పోతాయి. అలా మిగిలిన మ‌ద్యం కాల‌రీలు మన శరీరంలోని ‘ఆల్ద్‌1 ఏ1’ అనే ఎంజైమ్‌ను కొవ్వుగా మారుస్తుందట‌.


ఈ కొవ్వే శరీరంలోని అంతర్‌ అవయవాల చుట్టూ చేరుతుంది. ఇక ఆహారం ద్వారా వచ్చిన కాలరీలు ప్రధానంగా నడుము చుట్టూ, పొట్ట వద్ద, ఇతర కండరాల వద్ద పేరుకుపోతుందని తెలిపారు. మద్యంతో మరో ప్రమాదం ఉందని కూడా ప‌రిధోధ‌న చేసిన వైద్యులు తేల్చి చెప్పారు. రక్తంలో గ్లూకోజ్‌ను మన శరీరంలోని ‘గ్లూకాగాన్‌’అనే హార్మోన్‌ నియంత్రిస్తుందని, మద్యం ఎక్కువగా సేవించడం వల్ల శరీరంలో ఈ హార్మోన్‌ ఉత్పత్తి పడిపోతుందని వారు హెచ్చరించారు.


మరింత సమాచారం తెలుసుకోండి: