స‌హ‌జంగా ప్ర‌తి ఒక్క‌రూ బిజీ లైఫ్‌తో మార్నింగ్ బ్రేక్ ఫాస్ట్ తిన‌డానికి ఇష్ట‌ప‌డ‌రు. ఈ క్ర‌మంలోనే స‌మయం లేకపోవడంతో  చాలా మంది ఉదయం బ్రేక్ ఫాస్ట్‌ తినకుండా హడావిడిగా వెళ్లిపోతుంటారు. అయితే ఇలా చేయడం వల్ల భ‌విష్య‌త్తులో ఆరోగ్యంపై దుష్ప్రభావాలు చూపుతాయి. నిజానికి ఆరోగ్యంగా ఉండాలనుకునేవారు పొరపాటున కూడా బ్రేక్‌ఫాస్ట్ తినడం మాన‌కూడ‌దు. 


నిజానికి బ్రేక్ ఫాస్ట్ చేయ‌నివారిలో గ్లూకోజ్ స్థాయిలు అదుపుతప్పి చివరకు షుగర్ వ్యాధికి గుర‌వుతారు. ఇది ముఖ్యంగా మ‌హిళ‌ల్లో ఎక్కువ‌గా ఉంటుంది. అలాగే బ్రేక్ ఫాస్ట్ చేయ‌ని వారు కొన్ని రోజులకు చిన్న పనికే అలసిపోవడం, మరికొన్ని రోజులకు రక్తహీనత ఇలా పలు రకాల అనారోగ్య సమస్యలు చుట్టుముడతాయి. బ్రేక్ ఫాస్ట్ చేయడం వల్ల బరువు పెరుగుతామని చాలా మంది అపోహ ప‌డ‌తారు. 


నిజానికి బ్రేక్ ఫాస్ట్ చేయ‌క‌పోతే ఖచ్చితంగా బరువు పెరుగుతారని నిపుణులు చెబుతున్నారు. మార్నింగ్ బ్రేక్ ఫాస్ట్ చేయ‌క‌పోవ‌డం వ‌ల్ల ముఖ్యంగా జీవక్రియపై దీని ప్రభావం ఎక్కువగా ఉంటుంది. కొంద‌రు మార్నింగ్ బ్రేక్ ఫాస్ట్ చేయ‌కుండా డైరెక్ట్‌గా మ‌ధ్యాహ్నం భోజ‌నానికి ఇష్ట‌ప‌డ‌తారు. రాత్రి నుంచి దాదాపు 10 గంటలు పాటు ఏమీ తినకుండా ఉంటే శరీరానికి అవసరమైన శక్తి అందదు. 


దీని వల్ల పోను పోను రకరకాల గ్యాస్ట్రిక్ సమస్యలు వస్తాయి. చాలా సేపటి వరకు ఆకలితో ఉండటం వ‌ల్ల‌ ఒత్తిడి పెరిగి  హైపర్ టెన్షన్‌కి గుర‌వుతారు. అందుకే మార్నింగ్ బ్రేక్ ఫాస్ట్ ఇష్టం లేకుపోయినా.. త‌ప్ప‌ని స‌రిగా ఏదో ఒక‌టి తిన‌డం చాలా ఉత్త‌మం.


మరింత సమాచారం తెలుసుకోండి: