మానవత్వం నశించిపోతున్న నేటి రోజుల్లో, తాను వెళ్తున్న మార్గంలో గాయాల బారిన పడి, కొట్టుమిట్టాడుతున్న ఒక సర్పరాజాన్ని సకాలంలో ఆసుపత్రికి తీసుకెళ్లి దానికి పునర్జన్మ ప్రసాదించాడో మహానుభావుడు. అనంతరం ఆ సర్పరాజానికి మేజర్ ఆపరేషన్ చేసిన దానికి ప్రాణం పోసి పునర్జన్మ ప్రసాదించారు డాక్టర్లు. వివరాల్లోకి వెళితే, 

గాయం కారణంగా తోక భాగం దెబ్బతిని కదలడానికి ఎంతో అవస్థపడుతున్న ఒక సర్పరాజాన్ని గమనించిన ఒక స్వచ్చంద సంస్థకు చెందిన వ్యక్తి, దానిని దగ్గరలోని వెటర్నరీ ఆసుపత్రికి తీసుకెళ్లాడు. అయితే ఆ పాము పరిస్థితిని గమనించిన వైద్యుల బృందం, ముందుగా ఎక్సరే తీసిన తరువాత, దానికి ఎనస్తీషియా ఇచ్చి దాదాపుగా రెండు గంటలపాటు ఎంతో శ్రమించి, తోక భాగాన్ని తొలగించి, అనంతరం కుట్లు వేసి అతికించి అరుదైన ఆపరేషన్ ని నిర్వహిచడం జరిగింది. అంతేకాదు ఆపరేషన్ తరువాత దానిని మరొక రెండు రోజుల పాటు వారి అబ్జర్వేషన్ లో ఉంచి, 

పూర్తిగా నయమయిన తరువాత దానిని సమీప అడవిలో సురక్షితంగా  వదిలివేయడం జరిగింది. పాట్నా లోని ఒక ప్రాంతంలో జరిగిన ఈ ఘటన ప్రస్తుతం పలు మీడియా మాధ్యమాల్లో విపరీతంగా వైరల్ అవుతోంది. అయితే సర్పరాజానికి పునర్జన్మనిచ్చిన ఆ స్వచ్చంధ సంస్థ వ్యక్తితో పాటు, ఎంతో శ్రమించి దానిని బ్రతికించి నూతన జీవితాన్నిచ్చిన ఆ డాక్టర్లను పలువురు నెటిజన్లు ధన్యవాధాలు చెప్తూ తమ సోషల్ మీడియా మాధ్యమాల్లో కామెంట్స్ చేస్తున్నారు......!! 


మరింత సమాచారం తెలుసుకోండి: