స‌హ‌జంగా పూర్వం మట్టిపాత్రలు వాడేవారు. మ‌ట్టిపాత్ర‌లో వంట‌లు వండుకునేవారు. కానీ ప్ర‌స్తుతం అలాంటివి వాడ‌డం లేదు. నిజానికి వాటి గురించి తెలియ‌ని వారు కూడా ఉన్నారు. ఇటీవ‌ల కాలంలో రైస్ కుక్క‌ర్‌లు, మైక్రో ఓవెన్స్ ఇలా అనేక ర‌కాల ఎల‌క్ట్రిక్ ప‌రిక‌రాలు ఎక్క‌వ అయిపోయాయి. బిజీ లైఫ్‌లో తినే ఆహారాన్ని చాలా ఫాస్ట్‌గా చేసుకోవ‌డానికి అనేక ర‌కాల ఎల‌క్ట్రిక్ ప‌రిక‌రాల‌ను ఉప‌యోగిస్తున్నారు. ఈ క్ర‌మంలోనే చాలా ఎక్కువ‌గా వాడేది రైస్ కుక్క‌ర్‌.


అయితే అల్యూమినియం పాత్రను పక్కనబెట్టేయాలని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. అలాగే కుక్కర్లలో అన్నం వార్చడం, అదీ రైస్ కుక్కర్లను ఉపయోగించడం ఆరోగ్యానికి హానికరమని వారు హెచ్చరిస్తున్నారు. రైస్‌కుక్కర్లలో వండే ఆహారాన్ని తీసుకోవడం వ‌ల్ల‌ చిన్న వయస్సుల్లోనే కాళ్లనొప్పులు, కీళ్ల నొప్పులు, నడుం నొప్పి అంటూ అనేక స‌మ‌స్య‌లు త‌లెత్తుతాయి. 


కరెంట్ ద్వారా ఉడికిన ఆహారాన్ని తీసుకోకపోవడం ఆరోగ్యానికి హానీ చేకూర్చుతుంది.  ఇందులోని ఆహారం విషతుల్యం అయ్యే ఆస్కారం ఉంద‌ని, ఇందుకు రైస్ కుక్కర్లలోని టాక్సిన్ మెటల్ కారణమని పరిశోధనలో తేలింది. 


ఇందులో అన్నం ఉడికించడం ద్వారా అందులోని పోషకాలు కనుమరుగవుతున్నాయని, అవి కూడా నాన్ స్టిక్ కోటింగ్ గల రైస్ కుక్కర్లను అస్సలు వాడకూడదట. ఎందుకంటే నాన్ స్టిక్ వస్తువుల్లో ప్రమాదకరమైన కెమికల్స్ వండేటప్పుడు విడుదల అవుతాయని వెల్ల‌డించారు. మట్టి పాత్రలు లేకుంటే స్టీల్ పాత్రల్లో అన్నం వండుకోవ‌డం చాలా ఉత్త‌మం అని అంటున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: