సాత్వికాహారం, మితాహారం ఆరోగ్యానికి చాలా మంచిది. వయస్సును బట్టి భోజనం కూర‌తోను, చారుతోను చివరిగా మజ్జిగతో పూర్తి చేయ‌డం శ్రేష్ట‌క‌రం. రుచిగా ఉన్నదని అతిగా భోజనం చేయ‌డం మంచిది కాదు. ఎప్పుడూ కూడా వాటర్‌తో భోజనం ముగించాలి. ఆహారాన్ని బాగా నమిలి భోజనం చేయ‌డం త్వ‌ర‌గా జీర్ణం అవుతుంది. వేపుళ్లు, పచ్చళ్లు ఎక్కువగా తినడం త‌గ్గించుకుంటే ఆరోగ్యానికి మంచిది. భోజ‌నం చేసే స‌మ‌యంలో ఎప్పుడూ కూడా ఫ్రిజ్ వాటర్ తాగ‌కూడ‌దు.


దీని వ‌ల్ల శ‌రీరంలో చెడు కొల‌స్ట్రాల్ పెర‌గ‌డానికి ఉప‌యోగ‌డుతుంది. రకరకాల రంగు రంగుల కూరగాయలు, పండ్లతో కూడిన భోజనం కంటికీ, ఒంటికీ కూడా మంచి చేస్తుంది. ఉదయం బ్రేక్ ఫాస్ట్‌, మధ్యాహ్నం భోజనం రాజులా, రాత్రి భోజనం పిసినారిలాగా ప్రవర్తించాలి. రాత్రిళ్లు అధిక భోజ‌నం తీసుకోవ‌డం ఆరోగ్యానికి మంచిది కాదు. ఎప్పుడూ కూడా మితింగా ఆహారాన్ని తీసుకోవాలి. 


మార్నింగ్‌ టిఫిన్ చేసిన తర్వాత నడవ‌డం, మధ్యాహ్నం భోజనం తర్వాత కొద్దిగా విరమించ‌డం, రాత్రులు భోజనం తర్వాత క‌నీసం 100 అడుగులు నడ‌వ‌డం అల‌వాటు చేసుకోవాలి. అలాగే ఎప్పుడూ కూడా టీవీలు చూస్తూ, ఫోన్లు మాట్లాడుతూ భోజనం చేయడం ఆరోగ్యానికి హానీక‌రం. ఆకుకూరలు, కాయ‌గూర‌లు ఆరోగ్యానికి చాలా మంచివి. మ‌రియు తాజాపండ్లు కాలానుగుణంగా తీసుకోవాలి. 


చలికాలంలో ఎక్కువ భోజనం.. వర్షాకాలంలో మితంగా తీసుకోవ‌డం ఉత్త‌మం. ఉల్లి, వెల్లుల్లి ఆహారంలో భాగం చేసుకోవాలి. రాత్రి భోజనం 9గంట‌ల‌లోపు ముగించాలి. దీంతో పాటు అతిగా తీసుకునే టీలు, కాఫీలు, గుట్కాలు దూరంగా ఉంచ‌డం మంచిది. ఇవి ఆకలిని చంపి, ఉత్తేజాన్నిచ్చినట్టే ఉంటాయిగానీ జీర్ణాశయానికి హాని చేస్తాయి. సో.. బీ కేర్‌ఫుల్‌..!


మరింత సమాచారం తెలుసుకోండి: