భార్య కానీ, సహచరి కానీ.. తమ జీవిత భాగస్వాములను హత్య చేసే పురుషులు ''ఒక హత్యా క్రమాన్ని'' అనుసరిస్తారని నేరశాస్త్రం ప్రవీణులైన డాక్టర్ జేన్ మాంక్టన్ స్మిత్ చెప్తున్నారు. యూనివర్సిటీ ఆఫ్ గ్లోసెస్టర్‌షైర్‌లో లెక్చరర్‌గా పనిచేస్తున్న ఆమె బ్రిటన్‌లో 372 హత్యలను అధ్యయనం చేశారు. ఆ హత్యలన్నిటిలోనూ ఎనిమిది దశలుగా సాగిన ఒక హత్యా క్రమాన్ని గుర్తించారు.


ఎవరైనా ఒక పురుషుడు తన జీవిత భాగస్వామిని హత్య చేయగలడనటానికి.. భౌతికంగా నియంత్రించే అతడి ప్రవర్తన కీలక సూచిక కావచ్చునని డాక్టర్ జేన్ పేర్కొన్నారు.
ఈ అధ్యయనంలో గుర్తించిన అంశాలు.. ప్రాణాలను కాపాడటానికి దోహదపడగలవని ఒక హతురాలి తండ్రి అభిప్రాయపడ్డారు. పోలీసులు ఈ ఎనిమిది దశలను పసిగట్టగలిగితే చాలా హత్యలను నివారించవచ్చునని నిపుణులు భావిస్తున్నారు.


జీవిత భాగస్వాముల చేతుల్లో హత్యకు గురవుతున్న వారిలో మహిళలు 80 శాతం పైగా ఉన్నారని.. అత్యధిక ఉదంతాల్లో హత్య చేసిన భాగస్వామి పురుషుడేనని డాక్టర్ జేన్ చెప్పారు.


ఈ అధ్యయనం కోసం.. హతురాలికి గతంలో కానీ, హత్య జరిగేనాటికి కానీ హంతకుడితో సంబంధాలు ఉన్న కేసులన్నిటినీ ఆమె నిశితంగా పరిశీలించారు. అలాగే పురుషులు.. తమ పురుష భాగస్వాముల చేతుల్లో హతమైన ఉదంతాలనూ పరిశీలించారు.



మరింత సమాచారం తెలుసుకోండి: