ప్ర‌తి రోజు మీకు మందు తాగే అల‌వాటు ఉందా ?  లేని వారికి.. ఎప్పుడో ఒక‌సారి తాగేవాళ్ల‌కు ఎలాంటి ప్రాబ్లం లేదు. కంటిన్యూగానో లేదా ?  వారంలో రెండు మూడు రోజులో మందు తాగుతుంటే అలాంటి వాళ్ల‌కు పెద్ద స‌మ‌స్యే ఉంద‌ట‌. గ‌తంలో ప్ర‌తి రోజు మందు తాగినా మితంగా మందు తాగితే వ‌చ్చిన ముప్పేమి లేద‌నుకునే వాళ్ల‌కు తాజా అధ్య‌య‌నం షాక్ ఇచ్చింది. ఇక ఈ రిపోర్టు చూశాక అయినా మందు తాగేవాళ్లు జాగ్ర‌త్త‌గా ఉండాల‌ని హెచ్చ‌రిస్తున్నారు.


తాజాగా చేసిన అధ్యయనం ప్రకారం వారానికి కేవలం 100 గ్రాముల మందు మాత్రమే తాగాలని.. అందుకు భిన్నంగా వారానికి ఐదు గ్లాసుల వైన్.. 9 గ్లాసుల బీర్ పుచ్చుకుంటే మాత్రం అకాల మరణం తప్పదన్న మాటను చెబుతున్నారు. మెడికల్ జర్నల్ ది లాన్సెట్ చేసిన అధ్యయనంలో 19 దేశాలకు చెందిన ఆరు లక్షల మంది మందు అలవాట్లను.. వారి ఆరోగ్య స‌మ‌స్య‌ల‌ను ప‌రిశీలించారు. 


వారానికి 200 గ్రాముల నుంచి 350 గ్రాముల వ‌ర‌కు మందు తాగే వారు వారి జీవిత కాలంలో సాధార‌ణ మ‌రణంతో పోలిస్తే రెండు సంవ‌త్స‌రాలు ముందే చ‌నిపోతార‌ని స‌ర్వే చెప్పింది. ప్రతి వారం ఆరు గ్లాసుల వైన్.. అంతే మోతాదులో బీర్ తీసుకోవాలని.. అంతకు మించి మద్యం సేవిస్తే మాత్రం ఆరోగ్యానికి హానికరమని తేల్చింది. 


ఇక మ‌హిళ‌ల విష‌యానికి వ‌స్తే మహిళలు రోజుకు ఒక డ్రింక్.. పురుషులు రోజుకు రెండుసార్లు మితంగా మద్యం తీసుకుంటే ఓకే అంటోంది. సో.. మరి మీ మందు లెక్క స‌రిగా చూసుకుని తాగితే మంచిద‌నుకుంటా..!


మరింత సమాచారం తెలుసుకోండి: