ఈ మధ్య ప్రపంచ వ్యాప్తంగా పెళ్లి కాని ప్రసాదులు ఎక్కువై పోతున్నారు ఈ పరిస్థితి  భారత్ కంటే కూడా చైనా లో మరీ ఘోరంగా తయారయ్యింది. చైనా లో  ఒకరే ముద్దు ,ఇద్దరు వద్దూ అంటూ భారీ కొటేషన్లు పెట్టి జనాభా సంఖ్య తగ్గించే ప్రయత్నం చేసిన ప్రభుత్వం ఒక పక్క సక్సెస్ అయితే మరో పక్క ఈ వ్యవహారం కాస్తా చెడి అమ్మాయిల కంటే కూడా అబ్బాయిలు అధికమయ్యారు. దాంతో మహిళా శాతం ఘోరంగా పడిపోయింది. ఈ పరిస్థితుల కారణంగా

 

చైనాలో పురషులకి పెళ్ళిళ్ళు చేయాలంటేనే అందోళన పడుతున్నారు తల్లి తండ్రులు. గత ఏడాది 1000 మందికి గాను కేవలం 7.2 శాతం మందికి మాత్రమే పెళ్ళిళ్ళు అయ్యాయట. అంతేకాదు రానున్న 30 ఏళ్ళలో దాదాపు 30 లక్షల మంది యువతీ యువకులు పెళ్లి కాని ప్రసాదులుగా మారే ప్రమాదం ఉందని ఓ సంస్థ నివేదిక కూడా ఇచ్చిందట. దాంతో నష్ట నివారణ చర్యలు చేపట్టిన ప్రభుత్వం పెళ్లి కాని ప్రసాదుల కోసం ఓ వినూత్న కార్యక్రమం ఏర్పాటు చేసింది. దాని పేరు లవ్ పర్స్యూట్. ఈ పేరుతో ఓ ప్రత్యేకమైన  రైలు ని ఏర్పాటు చేసింది.

 

ఈ రైలులో ఒక్కో ట్రిప్పులో  దాదాపు 1000 మంది పెళ్లి కాని యువతీ యువకులు ప్రయాణం చేసే వీలు కల్పిస్తారు. ఈ ప్రయాణం రెండు పగళ్ళు ఒక రాత్రి ఉండేలా ఉంటుంది. ఈ రెండు రోజుల ప్రయాణం లో తమకి నచ్చిన భాగస్వామిని ఎవరైనా సరే  అన్వేషించు కోవచ్చు. రైలు లో ఉన్న వారిలో ఎవరైనా నచ్చితే వారితో స్నేహం చేసి, ఒకరినొకరు పూర్తిగా తెలుసుకుని, అంతా బాగుంది అనుకుంటే పెళ్లి చేసుకోవచ్చు. రెండు రోజుల్లో కార్యక్రమంలో రైలులోనే అందరికి భోజన వసతి , సదుపాయాలు కల్పించడమే కాకుండా, వినోద కార్యక్రమాలను కూడా ఏర్పాటు చేసింది అక్కడ ప్రభుత్వం. అయితే ఈ కార్యక్రమనికి భారీ స్పందన వస్తోందట. పిలిచి పిల్లని వెతుక్కోమంటే ఎందుకు ఆలోచిస్తాం అంటూ తండోప తండాలుగా తరలి వస్తున్నారట యువతీ యువకులు.

 


మరింత సమాచారం తెలుసుకోండి: