స‌హ‌జంగా ప్ర‌తి ఒక్క‌రికి ఎక్కిళ్లు వ‌స్తుంటాయి.  ఒక్కోసారి ఇవి చాలా ఇబ్బందిగా అనిపిస్తుంది. కొన్ని ఎక్కిళ్లు సాధారణంగా ఆగిపోయినా.. కొన్నిసార్లు మాత్రం ఎంత ప్రయత్నించినా తగ్గవు. కొంత మందికి తరచుగా కూడా వస్తుంటాయి. అతి వేగంగా తిన‌డం,  మ‌రీ చ‌ల్ల‌ని లేదా వేడిగా ఉన్న ప‌దార్ధాలు తీసుకోవ‌డం వ‌ల్ల ఎక్కువ‌గా ఎక్కిళ్లు వ‌స్తుంటాయి. ఇది త‌గ్గ‌డానికి ఎన్నో చిట్కాలు ఉప‌యోగిస్తారు. అయినా ఫ‌లితం ఉండ‌దు. అలాంట‌ప్పుడు ఇలాంటి చిట్కాలు వాడితే వెంట‌నే ఎక్కిళ్ల‌కు చెక్ పెట్ట‌వ‌చ్చు.


- శొంఠి పొడిని తేనేతో కలిపి తీసుకోవటం వలన కూడా ఎక్కిళ్ళు తగ్గుతాయి. శొంఠి, పిప్పళ్ళు ఉసిరిని పొడిచేసి తేనే, పటికబెల్లం చూర్ణంతో కలిపి సేవిస్తే ఎక్కిళ్ళు తగ్గుతాయి.


- వెక్కిళ్లు వ‌స్తుంటే ఊపిరిని గట్టిగా పీల్చి కొంతసేపు బిగబట్టి ఉండే గ‌నుక వెంట‌నే ఉప‌శ‌మనం ఉంటుంది.


- కొద్దిగా పంచదార నోట్లో వేయటం లేదా నీళ్ళలో పంచదార కలుపుకొని తాగడం వల్ల కూడా ఎక్కిళ్లు తగ్గుతాయి. 


- శొంఠిని పొడిచేసి బెల్లంతో కలిపి పీలిస్తే ఎక్కిళ్లు త‌గ్గుతాయి. 


- ఎక్కిళ్లు పోవాలంటే సడన్‌గా భయాందోళనలు కల్గించే మాటలు గానీ, షాకింగ్‌ న్యూస్‌ గానీ చెప్పటం వలన కూడా ఎక్కిళ్లు వెంటనే తగ్గుతాయి. ఎందుకంటే మన మెదడు ఆ న్యూస్‌కి రియాక్ట్‌ అయి వెంటనే స్పందిస్తుంది.


- ఎక్కిళ్లు ఎక్కువ‌గా వ‌స్తుంటే ఒక స్పూన్ నిమ్మ ర‌సం తీసుకుంటే వెంట‌నే ఉప‌శ‌మ‌నం క‌లుగుతుంది.


- చిన్న పిల్లలకు ఎక్కిళ్లు బాగా వస్తుంటే వాళ్ళనీ బోర్లాపడుకోబెట్టి వెన్ను తట్టాలి. ఇలా చేయటం వల్ల ఎక్కిళ్లు తగ్గుతాయి.


మరింత సమాచారం తెలుసుకోండి: