మనిషిని ముందుకు నడిపించేది ఆత్మవిశ్వాసమే.. అది ఒక్కటి ఉంటే చాలు జీవితంలో ఏదైనా సాధించొచ్చు.. ఈ విషయాన్ని బలంగా చెప్పే ఓ ఉదాహరణే ఇది..


ముంబాయ్ లోని ఒక చిన్న పారిశ్రామిక వేత్త వ్యాపార లావాదేవీలలో బాగా నష్టపోయి.. తిరిగి కోలేకోలేని స్థితిలో ఉన్నానని.. తనకు చావే శరణ్యమని భావించి.. చనిపోవాలని నిర్ణయించుకుని... చివరగా ఒక పార్కులో భగవంతుని ధ్యానంలో మునిగిపోయాడు.. ఇంతలో అతని వద్దకు ఒక వృద్ధుడు వచ్చి కూర్చుని ఏమినాయన బాగా సమస్యలో ఉన్నట్లున్నావని అడిగాడు. వ్యాపారి తన బాధనంత చెప్పుకున్నాడు.ఆ వృద్ధుడు వెంటనే చెక్ రాసి ఇచ్చి వచ్చే సంవత్సరం తిరిగి ఇదే రోజున నాకు తిరిగి ఇవ్వు అని చెప్పి మాయమయ్యాడు. వ్యాపారి ఆ చెక్కు చూసి దానిలో రతన్ టాటా అని ఉండడం చూసి ఆశ్చర్య పోతాడు... దేవుడు తనకు మరో అవకాశాన్ని ఇచ్చాడని కృతఙ్ఞతలు చెప్పుకుని తిరిగి ఇంటికి వచ్చాక.. ఆ చెక్ వాడకుండానే పని పూర్తయ్యేలా ప్లాన్ చేద్దామనుకుని కొన్ని ప్రణాళికలు వేసుకున్నాడు. అవి అన్నీ సంతృప్తిగా అనిపించి తెల్లవారిన తర్వాత వాటిని అమలులో పెట్టాడు.


అదేంటో గాని చెక్ తనవద్ద ఉందన్న ఆత్మవిశ్వాసంలో తాను వేసిన ప్రతి అడుగు విజయవంతం అవుతూ వచ్చింది. ధైర్యంగా తను వేసిన ముందడుగు వలన వెనుతిరిగి చూసుకునే అవకాశమే లేకుండా అన్ని కలిసొచ్చాయి. సంవత్సరం తిరిగే సరికి తన అప్పులన్ని పోను తానే మరికొందరికి పెట్టుబడి పెట్టేంత స్థాయికి చేరుకున్నాడు. ఇచ్చిన మాట ప్రకారం వృద్ధుడికి చెక్ ఇద్దామని బావించి అతను ఇచ్చిన చెక్ తో పాటు మరికొంత డబ్బు తీసుకుని పార్క్ కు వెళ్లి వృద్ధుడికోసం వెతకసాగాడు..


ఇంతలో ఒక నర్స్ అక్కడికి వచ్చి.. ఏమండీ ఆ వృద్ధుడు ఒక పిచ్చివాడు.. అతను తనకు తాను రతన్ టాటా అనుకుంటాడు.. మిమ్మల్ని ఏమైనా ఇబ్బంది పెట్టాడా అని క్షమాపణలు అడిగి అతనిని అక్కడినుండి తీసుకు వెళ్ళింది. వ్యాపారి ఆశ్చర్యపోయి ఆ చెక్కును పరిశీలించి.. అది ఒక చెల్లని చెక్కు అని నిర్దారణ అయ్యాక.. ఇన్నాళ్లు దీన్ని నమ్ముకునా నేను ఇంత ధైర్యంగా ముందుకు వెళ్ళిందని మరోసారి ఆశ్చర్యపోయాడు. తనను గెలిపించింది కేవలం ఆత్మవిశ్వాసం మాత్రమేనని గ్రహించి.. అది ఉంటె చేయలేనిదేమి లేదని తెలుసుకుని.. ఈ మాత్రం దానికేన తాను చనిపోదామనుకుందని సిగ్గుపడి.. తన జీవితానికి మార్గదర్శకంగా నిలిచిన పిచ్చివానికి మనస్సులోనే కృతజ్ఞతలు తెలుపుకున్నాడు.


మరింత సమాచారం తెలుసుకోండి: