ఏ వయసులో  జరగాల్సిన ముచ్చట ఆ వయసులో జరగాలి అంటారు. అది పెళ్లి చేసుకోవటం అయినా...పిల్లలను కనటం అయినా ....కానీ ప్రస్తుత కాలంలో  మనుసుల్లో పిల్లను కనే వయస్సు రోజు రోజు కి తగ్గుతుంది . వయస్సు పెరిగె కొద్దీ పిల్లలు కనటానికి అవకాశాము తగ్గిపోతుంది అని చెప్తుంటారు. కానీ ఈ మాటలన్నీ ఈ   బామ్మకి మాత్రం వర్తించవు .ఎందుకంటే 74  ఏళ్ళ వయసులో ఇద్దరు కవల పిల్లకి జన్మనిచ్చింది మంగాయమ్మ అనే బామ్మా . వినటానికి ఆశ్ఛర్యంగా ఉన్న ఇది నిజంగా జరిగిన సంఘటన .


తూర్పు గోదావరి జిల్లా నెలపర్తిపాడుకు చెందిన ఎర్రమట్టి రాజారావు, మంగాయమ్మ దంపతులకు 1962 మార్చి 22న వివాహమైంది. కాగా వీళ్లకు పిల్లలు  కాకపోవటం తో ఎన్నో హాస్పిటళ్ళ చుట్టూ తిరిగారు. కానీ ఫలితం లేకుండా పోయింది . తమ సంతానం ఆశ తీరకుండానే ఈ దంపతులు వృద్ధాప్యం వయస్సుకు  వచ్చేసారు. కానీ మంగాయమ్మకి మాత్రం సంతానం కావాలనే  కోరికా తీరేలేదు అని  నిరాశగా ఉన్న  మంగాయమ్మకి ...ఆమె ఇంటి పొరుగున్న ఉండే ఒక మహిళా 55  తర్వాత కృత్రిమ సంతాన సాఫల్యం  ద్వారా పిల్లలను కన్నది అనే విషయం  తెలిసింది .


దీంతో మంగాయమ్మ దంపతులు డాక్టర్ ని సంప్రదించగా ... డాక్టర్లు మంగాయమ్మని పరీక్షించి కృతిమ సంతాన సాఫల్య చికిత్స ప్రారంభించారు. కాగా మంగాయమ్మ 74 ఏళ్ళు ఉండటంతో  మెనోపాజ్‌ దశ దాటిపోయింది . దీంతో  వేరే మహిళ నుంచి అండాన్ని.. మంగాయమ్మ భర్త నుంచి వీర్యాన్ని సేకరించి ఇన్‌విట్రో ఫెర్టిలైజేషన్‌ పద్ధతిలో డాక్టర్లు ప్రయత్నం చేయగా ... వారి ప్రయత్నం ఫలించి కొన్ని రోజులకి మంగాయమ్మ గర్భం దాల్చటమే కాదు ...  స్కానింగ్లో  కావాలా పిల్లలు ఉన్నట్లు తేలటం తో  తేలింది . అప్పటి నుండి మంగాయమ్మని డాక్టర్ల పర్యవేక్షణలో ఉంచారు. కాగా ఈరోజు ఉదయం సిజేరియన్ ఆపరేషన్ ద్వారా పిల్లలను బయటకి తీయగా ... తల్లి పిల్లలు క్షేమంగా ఉన్నట్టు డాక్టర్ లు తెలిపారు. కాగా ఈ సిజేరియన్ ఆపేరేషన్ కి ముందు మంగాయమ్మకి శ్రీమంతం కూడా జరిపారు .



మరింత సమాచారం తెలుసుకోండి: