ఇంట్లో ఎల్లప్పుడూ ఉండే వాటిల్లో నిమ్మ ఒక‌టి. ఎందుకంటే ఎలాంటి వంటకంలోనైనా కొంచెం ఘాటు ఎక్కువైతే చాలు అందులో నిమ్మరసాన్ని పిండేస్తాం. ఎందుకంటే దీన్ని పులుపుతో మంటను తగ్గించేస్తుంది. అలాగే పుల్లగా ఉండే నిమ్మరసం వంటలకు టేస్ట్‌నే కాదు, చర్మానికి సౌందర్యాన్నిస్తుంది. మ‌రియు నిమ్మ‌ కిచెన్ క్లీనింగ్‌కు కూడా బాగా ఉప‌యోగ‌ప‌డుతుంది. మ‌రి అది ఎలాగో ఇప్పుడు తెలుసుకుందాం..


సింక్: నిమ్మరసంలో ఉప్పు వేసి గట్టిగా పేస్ట్‌లా చేసుకోండి. ఈ పేస్ట్‌లో డిష్ వాష్‌ను కలిపి సింక్‌ మొత్తానికి పట్టించండి. తర్వాత మామూలుగా క‌డిగితే చాలు సింక్ నీట్‌గా ఉంటుంది.


మైక్రోఓవేన్‌: ఒక కప్పు నీళ్లలో నిమ్మ బద్దను వేసి మైక్రోవేవ్ లో ఉంచి 15 నిమిషాల పాటు వేడిచేయాలి. తర్వాత గిన్నెను తీసి మొత్త‌టి వస్త్రంతో మైక్రో ఓవెన్‌ను గట్టిగా తుడవండి. అంతే ఓవెన్ కొత్తదానిలా త‌ళ‌త‌ళ‌లాడుతుంది.


దుస్తుల‌పై మ‌ర‌క‌ల‌ను తొల‌గించ‌డానికి:  దుస్తులపై మొండి మరకలు ఏర్పడిన సమయంలో వాటిపై నిమ్మ చెక్క‌ను గట్టిగా రుద్దండి.  తర్వాత ఉతికి ఎండలో బాగా ఆరబెడితే మరకలు మాయం అవుతాయి.


స్టీల్ పంపులు: చాలా మంది కిచెన్, బాత్‌రూంల్లో కూళాయికి సీల‌ను స్టీల్‌ది అమరుస్తారు. వీటిపై మరకలు పడతాయి. ఈ మరకలు తొలగించడానికి నిమ్మకాయ అత్యుత్తమమైనది.


చాపింగ్ బోర్డు: కూర‌గాయ‌లు, పండ్లు క‌ట్ చేయ‌డానికి వినియోగించే చాపింగ్ బోర్డుల్లో ఇరుకున్న అతి చిన్న ముక్క‌ల‌ను తొల‌గించ‌డం కోసం చాపింగ్ బోర్డుపై నిమ్మ‌చెక్క‌తో గ‌ట్టిగా రుద్దండి ఇలా చేస్తే చాపింగ్ బోర్డు క్లీన్‌గా ఉంటుంది.


చెత్త డ‌బ్బా దుర్వాస‌న పొగొట్ట‌డానికి: నిమ్మ బద్దతో చెత్త డబ్బాను గట్టిగా రుద్దండి. లేదంటే డబ్బా నిండా నిమ్మరసాన్ని స్ట్రే చేయండి. కొద్ది సేప‌టి త‌ర్వాత చ‌ల్ల‌ని నీటితో శ‌భ్రంగా క‌డ‌గండి. ఇలా చేయ‌డం వ‌ల్ల చెత్త డ‌బ్బాలోని దుర్వాస‌న ఇట్టే మాయ‌మ‌వుతుంది.


మరింత సమాచారం తెలుసుకోండి: