జుట్టు రాలుతుంటే ... బట్టతల వస్తున్నట్లు కనిపిస్తే  యువతీ, యువకుల్లో ఎక్కడాలేని ఆందోళన కన్పిస్తోంది . జుట్టు రాలడం అన్నది యువతి, యువకులకు నేడు  ప్రధాన సమస్యగా మారింది.  జుట్టు రాలిపోయి  బట్ట తల వచ్చిన యువత  ఆత్మన్యూనతా భావంతో బాధపడు తుంటారని  నిపుణులు చెబుతున్నారు .  ఈ సమస్యను అధిగమించడానికి ఇటీవల  చేసిన పరిశోధనలో పలు  అద్భుతమైన చిట్కాలను కనుగొనడం జరిగిందని నిపుణులు అంటున్నారు . అయితే ఈ చిట్కాలను మన పూర్వికులు ఆచరించారని , ప్రస్తుత పోటీ ప్రపంచం లో ఆచరించకపోవడం వళ్లే యుక్త వయస్సులో ఉన్న యువతి , యువకులు  జుట్టురాలడం అనే సమస్య బారిన పడుతున్నారని  చెప్పుకొచ్చారు .


 జుట్టు రాలడం అన్నది  సాధారణ సమస్య అని దాని గురించి పెద్దగా చింతించాల్సిన అవసరం లేదని అంటున్నారు.  జుట్టు రాలడానికి ప్రధాన కారణం మనం తీసుకునే ఆహారమేనని, అలాగే పని ఒత్తిడి కూడా ఒక కారణమని అంటున్నారు.  ఎక్కువగా విశ్రాంతి లేకపోవడం వల్ల కూడా జుట్టు రాలిపోతుందని చెబుతున్నారు.  జుట్టు రాలిపోకుండా ఉండడానికి పలు  చిట్కాలు పాటిస్తే చాలునని నిపుణులు వెల్లడించారు . విటమిన్ ఇ ఎక్కువగా ఉండే నువ్వుల నూనెను తలకు బాగా పట్టించి కాసేపటి తర్వాత గోరువెచ్చని నీటితో స్నానం చేస్తే క్రమంగా జుట్టు ఊడిపోవడం తగ్గుతుందని తెలిపారు .  మందార పువ్వులను కొబ్బరి నూనె లేక నువ్వుల నూనెలో వేసి కాచి ఆ నూనెను వెంట్రుకలకు పట్టించి ఒక గంట తర్వాత కుంకుడు రసంతో తలస్నానం చేస్తే వెంట్రుకలు రాలడం తగ్గుతుంది అని చెబుతున్నారు.


 మందార పువ్వులను మందార ఆకులను మెత్తగా నూరి తలకు బాగా పట్టించి కాసేపటి తరువాత తలస్నానం చేస్తే కూడా జుట్టు రాలడం అనే సమస్యను అధిగమించవచ్చునని   అంటున్నారు.  ఉసిరి రసం తీసి తలకు రాస్తే వెంట్రుకలు ఊడటం తగ్గి జుట్టు ఒత్తుగా పెరుగుతుంది అని చెబుతున్నారు.  అలాగే దోసగింజల ఎండబెట్టి దంచి నూనె తీసి దానిని  నిమ్మరసంతో కలిపి తలకు రాస్తే వెంట్రుకలు రాలడం తగ్గుతుందని నిపుణులు చెబుతున్నారు.  ఇలా పలు చిట్కాలను పాటించడం ద్వారా జుట్టు రాలే సమస్యను అధిగమించవచ్చని నిపుణులు తెలిపారు .


మరింత సమాచారం తెలుసుకోండి: