అందులో సందేహం అవసరం లేదు.  ఉపవాసం అంటే కనీసం రోజులో కొంత ఆహారం తప్పనిసరిగా తీసుకోవాలి.  లేదంటే మొదటికే మోసం వస్తుంది.  ఉపవాసం చేయాలని దేవుడు ఎప్పుడు చెప్పలేదు.  ఉపవాసం అంటే ఆహారం తీసుకోకుండా ఉండటం కాదు.  మితాహారం తీసుకుంటూ.. దేవుని భక్తిలో ఉండాలి అని అర్ధం.  


అలా కాకుండా గుజరాత్ కు చెందిన ఓ యువతి జైన్ సంప్రదాయం ప్రకారం ఉపవాసం చేయాలని అనుకున్నది.  జైన్ సంప్రదాయం ప్రకారం ఆ యువతి ఉపవాసం చేసేందుకు సిద్ధం అయ్యింది.  ఉపవాసం ఒకరోజో రెండు రోజులో కాదు.  ఏకంగా వారం రోజులు ఉపవాసం ఉండాలి.  అలా వారం రోజులు ఉపవాసం ఉండాలి అంటే మాములు విషయం కాదు.  చాలా ఇబ్బందులు వస్తాయి.  


ఆరోగ్యం దెబ్బతింటుంది.  కానీ పట్టుదలతో ఆ యువతి నాలుగు రోజులు ఉపవాసం చేసింది. అప్పటికే నీరసించిపోయింది.  హాస్పిటల్లో చేర్చారు.  ఉపవాసం మానాలని లేదంటే రోజులో కొంత ఆహరం తీసుకోవాలని సూచించారు.  కానీ, ఆ యువతి అందుకు ఒప్పుకోలేదు.  పైగా తమ ఆచారం ప్రకారం అలా చేసేందుకు కుదరదని చెప్పింది.  


అయితే, ఆచార సంప్రదాయాలను పక్కన పెట్టకుండా హాట్ వాటర్ తీసుకోవడానికి సరే అన్నది.  రెండు రోజులు హాట్ వాటర్ తీసుకున్నది.  చాలా రోజులుగా ఆహారం తీసుకోకుండా ఉండటంతో సడెన్ గా హార్ట్ ఎటాక్ వచ్చింది.  ఆ యువతిని హుటాహుటిన హాస్పిటల్ కు తీసుకెళ్లారు.  కానీ, అప్పటికే ఆ యువతి మరణించింది.  ఉపవాసం చెయ్యొచ్చుగాని, అతిగా మూఢభక్తితో ఉపవాసం చేస్తే ఇలానే ఉంటుందని వైద్యులు అంటున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: