Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
Mon, Sep 23, 2019 | Last Updated 12:39 pm IST

Menu &Sections

Search

పిల్ల‌ల ఎదుగుద‌ల‌కు తీసుకోవాల్సిన జాగ్ర‌త్త‌లు..

పిల్ల‌ల ఎదుగుద‌ల‌కు తీసుకోవాల్సిన జాగ్ర‌త్త‌లు..
పిల్ల‌ల ఎదుగుద‌ల‌కు తీసుకోవాల్సిన జాగ్ర‌త్త‌లు..
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
స‌హ‌జంగా చాలామంది పిల్లల్లో శారీరక, మానసిక ఎదుగుదల సరిగా ఉండదు, ఈ క్రమంలోనే చదువుల్లోనూ, ఆటపాటల్లోనూ వారు వెనుకపడిపోతుంటారు. పిల్లలకు సరైన పోషకాలు, విటమిన్స్‌ అందాలంటే కొన్ని రకాల ఆహారాలు తప్పనిసరి అని నిపుణులు సూచిస్తున్నారు. బాల్యంలో స‌రైన‌ పోషకాహారం తీసుకుంటేనే ఎదిగిన తర్వాత వారు చురుగ్గా ఉంటారు. చాలామంది తమ పిల్లలకు రోజు ఒకే రకమైన ఆహారం పెడుతుంటారు. పిల్లలు కూడా అలాంటి వాటికే అలవాటు పడుతుంటారు.


ఈ క్ర‌మంలోనే కొత్తవి తినడానికి ఇష్ట‌ప‌డ‌రు. అదే జరిగితే పిల్లల్లో శారీరక‌, మానసిక ఎదుగుదల సరిగా ఉండదు. పిల్ల‌లు చురుగ్గా ఉండాలంటే సరైన ప్రోటీన్లు అందించాలి. దీని కోసం వారి ఆహారంలో గుడ్డు ఖ‌చ్చితంగా ఉండాలి. గుడ్ల‌లో ప్రోటీన్ల శాతం ఎక్కువగా ఉంటుంది. ఈ క్ర‌మంలోనే రోజుకో గుడ్డు తినడం వల్ల పిల్లలు ఆరోగ్యంగా ఎదుగుతారు. ఓట్స్ ఆరోగ్యానికి చాలా మంచిది. వీటిలో ఫైబర్ శాతం ఎక్కువగా ఉంటుంది. వీటిని తీసుకుంటే పిల్లలు ఉత్సాహంగా తయారవుతారు.


ఉదయం బ్రేక్‌ఫాస్ట్‌ సమయంలో గానీ లేదా సాయంత్రం స్కూల్ నుంచి వచ్చిన తర్వాత గానీ పిల్ల‌ల‌కు పెడితే మంచిది. పిల్లలతో మంచినీటిని ఎక్కువగా తాగించాలి. ఎంత ఎక్కువ మంచినీరు తాగితే అంత మంచిది. అప్పుడప్పుడు నీటిలో నిమ్మరసం కలిపి పిల్ల‌ల‌తో తాగిస్తే వారికి విటమిన్ సి పుష్కలంగా అందుతుంది.


పిల్లలకు వారానికి ఒకసారైనా చేపలు తినిపించాలి. వీటిలో ఒమేగా 3 ఫ్యాటీ ఆమ్లాలు శరీరంలో మేలు చేసే హార్మోన్లను విడుదల చేస్తాయి. పిల్ల‌ల్లో కుంగుబాటు, ఒత్తిడి వంటి వాటిని దూరం చేస్తాయి. అదే విధంగా పిల్ల‌ల‌కు ప్ర‌తి రోజు నానబెట్టి పొట్టు తీసిన బాదం ఇవ్వాలి. దీని వ‌ల్ల పిల్ల‌ల్లో మెద‌డు ప‌ని తీరు స‌క్ర‌మంగా జ‌రుగుతుంది.



how to take care of children's health
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
ఎంతో రుచిక‌ర‌మైన ` రొయ్య‌ల ప్రై `
' క్యాప్సికం ' తినే ముందు ఇవి తెలుసుకోపోతే న‌ష్ట‌పోతారు..
అధిక బ‌రువుకు ద్రాక్షతో చెక్ పెట్టండిలా..
జ‌ట్టు స‌మ‌స్య‌ల‌కు చెక్ పెట్టే ' పుదీనా '
టేస్టీ టేస్టీ ` పొటాటో రైస్ `
ఎండు ద్రాక్ష‌తో మ‌ల‌బ‌ద్ద‌కానికి చెక్... ఎలాగో తెలుసా..!
వ‌ర్షాకాలంలో చ‌ర్మ చిట్కాలు...
గర్భిణీలు నెయ్యి తింటే ఏం అవుతుందో తెలుసా...
ఇంట్లోనే సులువుగా ` చాకోలెట్ క‌ప్‌కేక్ `
' రాగి ఉంగ‌రం ' వేలికి ధ‌రించ‌డం వ‌ల్ల ఏం అవుతుందో తెలుసా..
ఆకు కూరలు.. పోష‌క విలువ‌లు.. ఖ‌చ్చితంగా తెలుసుకోవాల్సిందే..
కాఫీ పౌడ‌ర్‌తో పాదాల ప‌గుళ్ల‌కు చెక్ పెట్టండిలా..
ధ‌నియాల‌లో ఉన్న హెల్త్ సీక్రెట్స్‌..
ఇండక్షన్‌ స్టవ్ వాడుతున్నారా... ఇవి తెలుసుకోపోతే న‌ష్ట‌పోతారు..
ఎంతో సులువుగా ` ఉలవచారు చికెన్ బిర్యాని `
ఇన్‌స్ట్రోగ్రామ్‌లో ఫొటోలు సేవ్ చేసుకోండిలా...
రోజూ రెండు అర‌టిప‌ళ్లు తింటే ఏం అవుతుందో తెలుసా..
అందంగా.. ఆక‌ర్ష‌ణీయంగా క‌నిపించాలంటే..ఈ టిప్స్ చాలు
బ్లాక్‌మేజిక్ (చేత‌బ‌డి) ఉందా..? లేదా..? నిజ‌మెంత‌..!
అదిరిపోయే ` ఆలూ ప‌రాటా `..
పెన్‌డ్రైవ్‌ ఫోన్‌కూ కనెక్ట్ చేసే యాప్ ఇదే..
చూయింగ్‌ గమ్‌తో క్యాన్సర్‌.. జ‌ర జాగ్ర‌త్త‌..
గుడ్డు తింటే కొవ్వు పెరుగుతుందా.. నిజ‌మెంత‌..!
About the author

Bharath has been the knowledge focal point for the world, As Darvin evolution formula End is the Start ... Bharath again will be the Knowledge Focal Point to the whole world. Want to hold the lamp and shine light on the path of greatness for our country Bharath.