స‌హ‌జంగా చాలామంది పిల్లల్లో శారీరక, మానసిక ఎదుగుదల సరిగా ఉండదు, ఈ క్రమంలోనే చదువుల్లోనూ, ఆటపాటల్లోనూ వారు వెనుకపడిపోతుంటారు. పిల్లలకు సరైన పోషకాలు, విటమిన్స్‌ అందాలంటే కొన్ని రకాల ఆహారాలు తప్పనిసరి అని నిపుణులు సూచిస్తున్నారు. బాల్యంలో స‌రైన‌ పోషకాహారం తీసుకుంటేనే ఎదిగిన తర్వాత వారు చురుగ్గా ఉంటారు. చాలామంది తమ పిల్లలకు రోజు ఒకే రకమైన ఆహారం పెడుతుంటారు. పిల్లలు కూడా అలాంటి వాటికే అలవాటు పడుతుంటారు.


ఈ క్ర‌మంలోనే కొత్తవి తినడానికి ఇష్ట‌ప‌డ‌రు. అదే జరిగితే పిల్లల్లో శారీరక‌, మానసిక ఎదుగుదల సరిగా ఉండదు. పిల్ల‌లు చురుగ్గా ఉండాలంటే సరైన ప్రోటీన్లు అందించాలి. దీని కోసం వారి ఆహారంలో గుడ్డు ఖ‌చ్చితంగా ఉండాలి. గుడ్ల‌లో ప్రోటీన్ల శాతం ఎక్కువగా ఉంటుంది. ఈ క్ర‌మంలోనే రోజుకో గుడ్డు తినడం వల్ల పిల్లలు ఆరోగ్యంగా ఎదుగుతారు. ఓట్స్ ఆరోగ్యానికి చాలా మంచిది. వీటిలో ఫైబర్ శాతం ఎక్కువగా ఉంటుంది. వీటిని తీసుకుంటే పిల్లలు ఉత్సాహంగా తయారవుతారు.


ఉదయం బ్రేక్‌ఫాస్ట్‌ సమయంలో గానీ లేదా సాయంత్రం స్కూల్ నుంచి వచ్చిన తర్వాత గానీ పిల్ల‌ల‌కు పెడితే మంచిది. పిల్లలతో మంచినీటిని ఎక్కువగా తాగించాలి. ఎంత ఎక్కువ మంచినీరు తాగితే అంత మంచిది. అప్పుడప్పుడు నీటిలో నిమ్మరసం కలిపి పిల్ల‌ల‌తో తాగిస్తే వారికి విటమిన్ సి పుష్కలంగా అందుతుంది.


పిల్లలకు వారానికి ఒకసారైనా చేపలు తినిపించాలి. వీటిలో ఒమేగా 3 ఫ్యాటీ ఆమ్లాలు శరీరంలో మేలు చేసే హార్మోన్లను విడుదల చేస్తాయి. పిల్ల‌ల్లో కుంగుబాటు, ఒత్తిడి వంటి వాటిని దూరం చేస్తాయి. అదే విధంగా పిల్ల‌ల‌కు ప్ర‌తి రోజు నానబెట్టి పొట్టు తీసిన బాదం ఇవ్వాలి. దీని వ‌ల్ల పిల్ల‌ల్లో మెద‌డు ప‌ని తీరు స‌క్ర‌మంగా జ‌రుగుతుంది.



మరింత సమాచారం తెలుసుకోండి: