నిన్నటి వరకూ శివన్ అంటే పెద్దగా ఎవరికీ తెలియదు. కానీ చంద్రయాన్ -2 విషయంలో అలుపెరుగని కృషి చేసిన ఓ అద్భుతమతడు. పుట్టింది పల్లెటూళ్ళోనే అయినా, వ్యవసాయ కుటుంభం నుంచీ వచ్చినా సరే శివన్ ఆలోచనలు అన్నీ ఏదన్నా సాధించాలి అనే కసితో శ్రమించే వారట. ఎంతో పేదరికాన్ని దాటుకుంటూ, ఉన్నత చదువులకి తన ఆర్ధిక పరిస్థితి సహకరించక పోయినా అన్ని అవరోధాలు దాటుకుంటూ ఇస్రో చైర్మెన్ గా ఎదిగిన తీరు చూస్తే శివన్ కి సలాం కొట్టాల్సిందే.

 

కన్న బిడ్డలా చూసుకున్న చంద్రయాన్ -2 ప్రాజెక్ట్ చివరి నిమిషంలో చేజారిపోయి    భావోద్వేగానికి లోనయిన శివన్ ని  మోడీ హత్తుకుని  ఓదార్చడం చూస్తే, శివన్ ఈ ప్రాజెక్ట్ ని ఎంత ప్రేమగా, ఓ  కమిట్మెంట్ గా చేశారో ఇట్టే అర్ధమవుతుంది. ఓ నిరుపేద రైతు కుటుంభం నుంచీ ఉన్నతస్థాయి వ్యక్తిగా ఎదిగిన శివన్ కి మద్రాసు ఐ ఐటీలో చేరేవరకూ కాళ్ళకి వేసుకోవడానికి చెప్పులు కొనుక్కోలేని పరిస్థితిలో శివన్ ఉండేవారంటే  ఎలాంటి పేదరికాన్ని అనుభవించారో అర్థం చేసుకోవచ్చు.

 

స్కూలు చదువుల సమయంలో శివన్ స్కూలు నుంచే ఇంటికి రాగానే తన తల్లి తండ్రులతో పాటు పొలం పనులు చేసేవారట. శివన్ పనికి వెళ్ళిన సమయంలో కూలికి వేరే ఎవరిని పెట్టుకునే వారు కాదట. సహనం, ఓర్పు, పరిశోధించే తత్వం తనకి పొలం పనులు చేయడంవలనే వచ్చాయని ఇప్పటికీ శివన్ ఎంతో గర్వంగా చెప్పుకుంటారు. అయితే ఇంజనీరింగ్ చదవాలనే ఆశకి మళ్ళీ తన పేదరికం అడ్డు రావడంతో డిగ్రీ బీయస్సీ మాధమేటిక్స్ తీసుకున్న ఆయన ఎంతో భాధపడేవారట. దాంతో తన ఆశయాన్ని తెలుసుకున్న శివన్ తండ్రి తన పొలాన్ని అమ్మి మరీ ఆయన్ని ఇంజనీరింగ్ లో చేర్పించారట. ఏరోనాటికల్ ఇంజనీరింగ్ పూర్తి చేసిన శివన్

 

ఉద్యోగాలు లేకపోవడంతో ఉన్నత చదువులు చదవాలని నిర్ణయం తీసుకున్న ఆయన ఇండియన్ ఇన్స్టిట్యూట్  ఆఫ్   సైన్స్ లో చేరారు. ఇక్కడ చదువు పూర్తి అవగానే శాటిలైట్ సెంటర్ లో చేరాలని అనుకున్న ఆయనకీ విక్రం సారాభాయ్ సెంటర్ లో చేరారు. అక్కడినుంచీ క్రమక్రమంగా ఎదుగుతూ చివరికి ఇస్రో చైర్మెన్ స్థాయికి ఎదిగారు. ఎంత ఎదిగినా ఇప్పటికి ఎంతో సింపుల్ గా  ఉండటానికే ప్రాధాన్యతని ఇచ్చే శివన్ ఎంతో మందికి ఆదర్సనీయుడుగా ఉంటారనడంలో సందేహం లేదు.


మరింత సమాచారం తెలుసుకోండి: