సిల్క్, కాటన్, పాలిస్టర్, పట్టు, గద్వాల్ పట్టు, పోచంపల్లి పట్టు ఇలా ఎన్ని చీరలు ఉన్న ఏదైనా శుభకార్యం వచ్చింది అంటే కంచి పట్టు చీరలకే మహిళలు మొదటి ప్రాధాన్యత ఇస్తారు. ఇంకా తెలుగు రాష్ట్రాల్లో మహిళలు అయితే ఏదైనా ఒక శుభకార్యం వచ్చింది అంటే ప్రత్యేకంగా కంచిపట్టు చీర కోసం కంచికి వెళ్లి కొంటారు. 


కంచి పట్టుకు అంత ప్రాధాన్యత ఉంది. తమిళనాడులోని కాంచీపురం పేరు మీద ప్రసిద్ధమైన ఆ పట్టు చీరలను ప్రస్తుతం మన తెలుగువారు తాయారు చేస్తున్నారు. చిత్తూరు జిల్లా మదనపల్లె, అనంతపురం జిల్లా ధర్మవరంలలో మగ్గాలపై కొన్నేళ్లుగా ఈ కాంచీపురం చీరలను నేస్తున్నారు. దీంతో ఈ మధ్యకాలంలో ఈ చీరాల అమ్మకాలు జోరును పెంచాయి. 


ఇక్కడ విచిత్రం ఏంటంటే కాంచీపురం వ్యాపారాలు మన చీరల్ని కొని అక్కడికి  వెళ్లి అమ్ముకుంటున్నారు. మన నేతన్నల కంచి చీరలకు అంత ప్రాధాన్యత వచ్చింది. మన నేతన్నలు ఎక్కువగా కంచి పట్టు చీరల తయారీలో శుద్ధమైన జారీ వాడుతూ అంచుల్లోనూ, చీర మధ్యనా బుటా పెద్దగా ఉండేలా చూసుకుంటున్నారు. 


కాంచీపురంలో చేనేత మగ్గాలు తగ్గి, పవర్ లూమ్స్ సంఖ్య క్రమంగా పెరుగుతూ వస్తుంది. కాంచీపురంలో దాదాపు చేనేత మగ్గాల సంఖ్య 5 వేల నుంచి 500కు తగ్గింది. గత ఏడు సంవత్సరాల్లో చుట్టూ పక్కల పరిశ్రమలు పెరగడంతో చేనేతలు మరమగ్గాలని వదిలేసి పరిశ్రమల్లో పనులకు వెళ్తున్నారు.     


ఇటు మదనపల్లె, ధర్మవరంలో క్రమంగా కంచిపట్టు చీరాల తయారీ క్రమంగా పెరిగింది. లాభదాయకంగాను ఉండటంతో మన నేతన్నలు పెద్దఎత్తున తాయారు చేస్తున్నారు. పెద్దరికం చీరను నేసేందుకు కార్మికులకు 7 నుంచి 10 రోజులు పడుతుంది. ఆ చిరాకు దాదాపు 12వేలు కూలి వస్తుంది. 


ఇక్కడ ఇంకో గమ్మత్తయిన విషయం ఏంటంటే కంచిపట్టు చీరను ఒక్కరే నేస్తారు. నెలకు రెండు చీరలు లేదా మూడు చీరలు నెయ్యగలరు. కొంతమంది సొంతంగా నేస్తుంటే మరి కొందరు కార్మికులు కూలి పని చేస్తున్నారు. పెద్దరికం చీరకు 12 వేలు సాధారణ చీరలకు ఒక్కో చిరాకు 3 వేలు లేదా 4 వేల రూపాయిల చొప్పున ఇస్తారు. 


ఈ చీరలకు రోజు రోజుకు ప్రాధాన్యత ఎక్కువ అవుతుండటం వల్ల ధర్మవరంలో 20వేలు, మదనపల్లెలో 15 వేలు మగ్గాలు ఉన్నాయి. కంచిపట్టు చీరాల తయారీతో పాటు అనుబంధంగా దారం తియ్యడం, దారలకు రంగులు అద్దకం వంటి పనుల్లో స్థానికులు ఉపాధి పొందతున్నారు. కేవలం ఈ రెండు ప్రాంతాల్లో కంచి చీరాల వల్ల దాదాపు 35 వేల కుటుంబాలకు ఉపాధి లభిస్తుంది.


మరింత సమాచారం తెలుసుకోండి: