మరణాన్ని జయించడానికి మనిషి పడుతున్న ఆవేదన,ఆలోచన అంతాయింతా కాదు.నిజం చెప్పాలంటే ఇది సృష్టికి విరుద్దం. పాత నీరు బటికి వెళ్లితేనే కొత్త నీరు వస్తుంది. అలాగే జన్మించుట మరణించుట కొరకే అనే సిస్టాన్ని మనిషి బ్రేక్ చేయవద్దు.ఒక వేళా ఇలా జరిగినప్పుడు ప్రపంచంలో జరిగే వినాశనాన్ని ఆపడం ఎవరితరం కాదు ఇది ఎంతవరకు ఆలోచించారో తెలియదు కాని కొందరు శాస్త్రవేత్తలు చేస్తున్న పరిశోధన వల్ల మనిషికి 2050 నాటికి వృద్దాప్యం అనేది రాకుండా పోతుందట.



వారు చెబుతున్న విషయాలు గమనిస్తే భవిష్యత్తులో వృద్దాప్యం అనేది కూడా ఎవరికి తెలియకుండా పోయి,నవ యవ్వనంతో ఉండగలిగేలా శరీర కణాలను,అవయవాలను సృష్టిస్తున్నారట.దుబాయ్‌లో జరిగిన వరల్డ్‌ గవర్నమెంట్‌ సమ్మిట్‌లో హిబ (HIBA హైబ్రిడ్‌ ఇంటిలిజెన్స్‌ బయోమెట్రిక్‌ అవతార్‌)ను ప్రదర్శించారు. అనేక పరిశోధనల అనంతరం దీన్ని సృష్టించారట.ఇక మానవ మేధస్సు,కాన్షియస్‌నెస్‌ ద్వారా మనుషులు కలుస్తారనే దానికి నిదర్శనమే హిబ అని,దీన్నిపరిశోధిస్తున్నప్పుడే తనకు మరణమంటూ లేని మనిషిని తయారు చేయాలనే ఐడియా వచ్చిందని పరిశోధకుల్లో ఒకరైన పియర్సన్‌ తెలిపారు.



మనిషిని చిరకాలంగా ఉండేలా చేసేందుకు మూడు పద్దతులున్నాయని అందులో మానవ శరీరాన్ని కృత్రిమంగా తయారు చేయడం ఒకటి.ల్యాబ్‌లో శరీర అవయవాలను, కణాలను తయారు చేసి అమర్చడం.ఇంకో పద్దతి రోబోలను తయారు చేసి వాటికి చనిపోయిన మానవుని మేధస్సును జోడించడం.వీటిద్వారా మరణించిన మనిషిని మరలా చూసుకునేలా చేయాడం జరుగుతుందని తెలిపారు.ఏది జరిగిన మానవాళికి ముప్పువువాటిల్లేలా చేయకూడదు.కాని ఇప్పుడు చేసే ప్రయోగాలు ఏ పరిస్ధితులకు దారి తీస్తాయో తెలియదంటున్నారు కొందరు..


మరింత సమాచారం తెలుసుకోండి: