సాధార‌ణంగా చాలా మంది నొప్పి చిన‌దైనా పెద్ద‌దైనా ముందు వెనుక ఆలోచించకుండా ఇంగ్లీష్ మందులు తీసుకుంటారు. వాటిని తీసుకోవడం వల్ల ఆ క్షణంలో బాధ త‌గ్గినా భవిష్యత్తులో తీవ్రమైన సమస్యలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. వాస్తవానికి డాక్టర్ సలహా లేకుండా మందులు తీసుకోవడం వల్ల అవి ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతాయి. అందుకని మందులు తీసుకునే ముందు వాటి వల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ గురించి తెలుసుకోవాల్సి ఉంటుంది.


గ్యాస్: గ్యాస్ బిళ్ళల వల్ల పొట్ట అంతా పూర్తిగా పాడవుతుంది. వీటి వల్ల మేలు కన్నా కీడే ఎక్కువ ఉంటుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఎందుకంటే టాబ్లెట్లు వేసుకుంటే సహజంగా విడుదలవ్వాల్సి ఆమ్లాలు నశిస్తాయి. దీంతో జీర్ణాశయం పూర్తిగా నష్టపోతుంది. అంతేకాక ఆహారంలోని పోషక తత్వాల‌ను శోషించే శక్తిని కోల్పోతుంది. దీంతో కిడ్నీలో రాళ్లు, ఫైల్స్, అల్సర్ వంటి సమస్యలు వచ్చే ప్రమాదం ఉంది.


జలుబు: జలుబు, చలి జ్వరం మాత్రలు తీసుకోవడ‌మ‌నేది పిల్లల నుంచి పెద్దల వరకు ప్రతి ఒక్కరికి ప్రమాదమే. ఇవి ఊపిరితిత్తులపై తీవ్ర ప్రభావం చూపుతాయి. ఈ మందులు కనుక ఓవర్ డోస్ అయితే సైడ్ ఎఫెక్ట్స్ తప్పనిసరి. ఇవి మరీ శృతిమించితే మరణం కూడా సంభవిస్తుంది.


నిద్ర మాత్రలు: నిద్ర మాత్రలు పూర్తి జీవనశైలి మీద ప్రభావం చూపుతాయి. ఈ మాత్రలు తరచూ తీసుకోవడం వల్ల మొద‌డుపై దుష్ప్రభావాన్ని చూపుతాయి. పూర్తి దినచర్యను పాడు చేస్తాయి. అంతే కాక శరీరంలోని శక్తి పూర్తిగా క్షీణింప‌చేస్తుంది.


డిప్రెషన్: ఈ మందులు మాటల్లో చెప్పలేనంత సైడ్ ఎఫెక్ట్స్ కలిగిస్తాయి. ముందుగా మస్తిష్క పరిధిలోని వాటిపై, మెదడు పైన ప్రభావాన్ని చూపుతాయి. సిరోటిన్ గ్లూకోజ్, గ్లూకోజ్‌ లెవెల్స్ ను నియంత్రిస్తుంది.


తలనొప్పి: చాలామంది తలనొప్పి వచ్చిందంటే చాలు మాత్రలు వేసుకుంటారు. దీని వల్ల జరిగే పరిణామాల గురించి మాత్రం ఆలోచించ‌రు. ఈ మాత్రలు కంటిపై తీవ్ర‌ దుష్ప్రభావాన్ని చూపుతాయి. కాబ‌ట్టి వీటికి దూరంగా ఉండ‌డం చాలా ఉత్త‌మం.  


మరింత సమాచారం తెలుసుకోండి: