ఓ టీనేజర్ మొదటి సారిగా తల్లి కాబోతోంది. ఎంతో జాగ్రత్తగా తన కడుపులో బిడ్డని కాపాడుకుంటూ ఎప్పుడు బిడ్డ బయటకి వస్తుందో చూసుకుని మురిసిపోవాలని పరితపించి పోయింది. వైద్యులని సంప్రదిస్తూ ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటోంది. ఎప్పటిలాగానే వైద్యుడిని సంప్రదించి స్కానింగ్ తీయించుకుంది. అయితే స్కానింగ్ లో తన బిడ్డని చూసి ఒక్క సారిగా షాక్ అయ్యి కంగారు పడిపోయింది. తన కడుపులో ఉంది దెయ్యం పిల్ల అంటూ కేకలు పెట్టింది.

 

ఆ స్కానింగ్ రిపోర్ట్ లో జుట్టు విరబూసుకుని, కనుగుడ్లు పెద్దవిగా చేసి అలాగే తీక్షణంగా చూస్తున్నట్లుగా రిపోర్ట్ లో ఉంది. దాంతో అది దెయ్యం పిల్లగా నిర్దారించికుని ఆందోళన చెందింది. వెంటనే స్పందించిన వైద్యులు అది దెయ్యం పిల్ల కాదని, మీ బిడ్డే అంటూ సర్ది చెప్పారు. వైద్యులు సర్ది చెప్పడంతో కాస్త సమయం తరువాత తేరుకుంది ఆమె. అయితే ఆ స్కానింగ్ చిత్రాని సోషల్ మీడియాలో షేర్ చేసింది. దాంతో అది కాస్తా వైరల్ అయ్యింది. అయితే

 

అది చూసిన వాళ్ళందరూ నిజంగానే దెయ్యం పిల్లలా ఉంది అనగా, ఒక వేళ దెయ్యం కాక మాములుగా పిల్ల అయితే అలా కడుపులో ఉన్న పిల్ల ఎలా చూస్తుంది అంటూ ప్రశ్నలు సంధిస్తున్నారు. సాధారణంగా కడుపులో పిల్లలు కళ్ళు మూసుకుని ఉంటారని, స్కానింగ్ సమయంలో కళ్ళు తెరవడం ఎప్పుడూ చూడలేదని కొందరు వైద్యులు కామెంట్స్ చేస్తున్నారు. అయితే అప్పటికే మెంటల్ గా అన్నిటికి సిద్దమైన ఆ టీనేజర్ పుట్టేది దెయ్యం పిల్ల అయినా పర్లేదు అని ఫిక్స్ అయ్యిపోయిందట.

 

 

 

 


మరింత సమాచారం తెలుసుకోండి: