ప్రతిరోజు ఉదయం లేవగానే మొదట చేసే పని ఏంటంటే బ్రష్ చెయ్యడమే. పళ్లు తెల్లగా ఉండటానికి, నోటినుంచి దుర్వాసన రాకుండా ఉండేందుకు ఉదయం లేవగానే బ్రష్ చేస్తాం. ఇంకా ఇప్పుడు చాలామంది అయితే టీవీల్లో వచ్చే ప్రకటనలు చూసి టూత్ పేస్ట్ వాడుతుంటారు.. ఇన్నాళ్లు మనకు టూత్ పేస్ట్ వల్ల లాభాలు మాత్రమే తెలుసు. ఇప్పుడు ఆ టూత్ పేస్ట్ వల్ల నష్టాలు ఏంటో కూడా తెలుసుకోండి. ఒకసారి టూత్ పేస్ట్ వల్ల నష్టాలు తెలుసుకున్నారంటే మళ్ళీ టూత్ పేస్ట్ ని వడలనుకోరు. అలాంటి నష్టాలు టూత్ పేస్ట్ లో ఉన్నాయి. 


టూత్‌ పేస్టులలో పాలీ ఇథైలిన్‌ అనే రసాయనం ఉంటుంది. ఈ రసాయనం శరీరానికి విషపదార్థం మాదిరిగా భావించాలి. దీని కారణంగా మూత్రపిండాలు, మెదడు సమస్యలు వస్తాయట.
టూత్‌ పేస్ట్‌ వల్ల థైరాయిడ్‌ సమస్యలు వస్తాయట. నోటిలోని క్రిములను నాశనం చేసేందుకు టూత్‌ పేస్ట్‌లలో ''ట్రిక్లోసెన్‌''అనే రసాయనాన్ని కలుపుతారట. దీని కారణంగా థైరాయిడ్‌, గుండె సమస్యలతో పాటు క్యాన్సర్‌ వ్యాధులు వస్తాయని నిపుణులు చెప్తున్నారు. 
టూత్‌ పేస్ట్‌ తయారీలో ప్లోరైడ్‌ను ఎక్కువగా వాడతారు. ఇవి చిగుళ్ళను మాత్రమే కాకుండా, పిల్లలలో తెలివి తేటలను తగ్గించేస్తాయి. గర్భిణులు ప్లోరైడ్‌ ఉన్న టూత్‌ పేస్ట్‌ల వాడకపోవడమే మంచిది. వీటి వలన థైరాయిడ్‌ సమస్యలతో పాటు ఎముకల సాంద్రత తగ్గిపోతుంది, కడుపులోని బిడ్డ ఎముకల దృఢత్వాన్ని కూడా ఫ్లోరైడ్‌ అడుకుంటుంది.
సోడియం లారిల్‌ సల్ఫేట్‌ను టూత్‌పేస్టు తయారీలో కూడా వాడతారు. వీటి వలన నోట్లో అల్సర్‌లు, చర్మ సమస్యతో పాటు హార్మోన్లలో అసమానతలు కూడా తలెత్తుతాయి.
తీపి పదార్థాలు ఎక్కువగా తింటే దంతాలు పాడవుతాయి అంటారు. కానీ, టూత్‌పేస్ట్‌లలో కూడా చక్కెర ఉంటుంది. ఈ కృత్రిమ చక్కెరల వల్ల మధుమేహం, స్థూలకాయం వస్తుందని పరిశోధనలలో వెలువడింది. అంతే కాకుండా, టూత్‌పేస్ట్‌లలో ఎక్కువగా ఉపయోగించే రసాయనాల వల్ల బ్రెయిన్‌ ట్యూమర్‌ వంటి క్యాన్సర్‌ సమస్యలు కూడా వస్తాయట.
దంతాలు తెల్లగా మెరవడానికి టూత్ పేస్ట్ వాడితే వాటి వల్ల ఇన్ని నష్టాలు ఉంటాయని అర్ధం అవుతుంది. అంటే ఈ విషయాలను బట్టి చూస్తే తెలుస్తుంది. టూత్ పేస్ట్ వొద్దు పూర్వికులు చెప్పిందే ముద్దు అని. వేపపుల్లలు, ఉత్తరేణి వేర్లు, బొగ్గుపొడి వంటివి వాడటమే ఉత్తమం అని. అందుకే వేప పుల్లలు, బొగ్గు పొడి వంటి పదార్ధాలు అమెజాన్, ఫ్లిప్ కార్ట్ వంటి షాపింగ్ సైట్స్ లో పేస్ట్ కాంటే ఎక్కువ ఖరీదు ఉంటాయి. ఏది ఏమైనా ఈసారి టూత్ పేస్ట్ వాడే ముందు ఆలోచించి వాడండి.  



మరింత సమాచారం తెలుసుకోండి: