న‌వ్వు కూడా ఓ ఔష‌ధ‌మే అని మీకు తెలుసా? వాస్త‌వానికి ఆరోగ్యం కావాలంటే మంచి ఆహారం, కాలుష్య రహిత వాతావరణంతో పాటు నవ్వుతూ ఉండటమూ చాలా అవసరమని చాలా మందికి తెలియ‌దు. నవ్వడం వల్ల కండరాలు విశ్రాంతి పొంది, మానసిక ఒత్తిడి తగ్గుతుంది. నవ్ఞ్వ అంటే ఏదో విదేశీ కల్చర్‌లాగా లాఫింగ్‌ క్లబ్బుల్లో కాసేపు గడిపి, వారు నవ్వించే సన్నివేశాలను బట్టి నవ్వడం కాదు. నవ్వు అనేది నిర్మలమైన మనసు అనే బావిలో నుంచి ఊరేదిగా ఉండాలి.


శారీరకంగానూ, మానసికంగానూ ఎంతో ఆరోగ్యాన్నిచ్చి, ఉత్సాహంగా, ఉల్లాసంగా ఉండేలా చేసేది నవ్వు.మనస్ఫూర్తిగా నవ్వే వ్యక్తులు ఎక్కువ కాలం జీవిస్తార‌ట‌. నోరు పెద్దగా చేసుకొని నవ్వడం, కళ్ల కింద ముడతలు ఉన్న వ్యక్తులు జీవితం పట్ల సానుకూల దృక్పథంతో ఉంటారు. ఆరోగ్యవంతమైన జీవితాన్ని గడుపుతారు. జీవితంలో ఎన్నడూ నవ్వని ఆటగాళ్లు సరాసరిన 72.9 ఏళ్లు అప్పుడప్పుడూ మాత్రమే నవ్విన వాళ్లు 75 ఏళ్లు, బిగ్గరగా నవ్వేవాళ్లు 79.9 ఏళ్లు జీవించినట్లు పరిశోధనల్లో తేలింది.


మొహమాటం కోసం ఉత్తుత్తి నవ్వులు చిందించేవారు ఆయుష్షులో ఎలాంటి మార్పులేదట. బిగ్గరగా నవ్వే వారి ముఖంపై ఉండే కండరాలు సంకోచ, వ్యాకోచం చెంది కాంతివంతమైన వర్ఛస్సుతో ఉంటారు. ఒక్క నిమిషం మనస్ఫూర్తిగా నవ్వితే చాలు.. పది నిమిషాలు వ్యాయామం చేసిన ఫలితం. నవ్వు ఏరోబిక్‌ వ్యాయామాల్లా గుండె, రక్త సరఫరా వ్యవస్థను ఉద్దీపన చేస్తుంది.


అనేక రోగాలను దూరం చేసే మంచి టానిక్‌ అని, దీనికి మించిన వ్యాయామం లేదని వైద్య నిపుణులు చెప్పకనే చెబుతున్నారు. మనసు ప్రశాంతంగా ఉండేలా చేస్తోందీ నవ్వు. కోపం, ద్వేషం, ఒత్తిళ్ల‌ భారిన పడకుండా చేస్తుంది. అలాగే శ‌రీరంలో రోగనిరోధక శక్తిని పెంపొందిస్తుంది.


మరింత సమాచారం తెలుసుకోండి: