ప్ర‌స్తుతం ఎక్కువ శాతం మంది మైగ్రేన్‌ బాధ‌ప‌డుతున్నారు. మైగ్రేన్‌ తలనొప్పితో  బాధపడేవారు కేవలం వైద్యుల సలహాలతో పాటు కొన్ని జాగ్రత్తలు కూడా పాటించాలి. అప్పుడే సమస్య నియంత్రణలో ఉంటుంది. వైద్యుల సలహా మేరకు మందులు వాడటం... నొప్పి బాధించినప్పుడు కూడా ఆహార, ఇతర నియమాలు పాటించడం మేలు. అలానే కొందరు ఈ సమస్యను దూరం చేసుకోవాలనే ఉద్దేశంతో ఇంట్లోనే సొంత ప్రయోగాలు చేస్తుంటారు. అలాంటి వారు నిపుణుల సలహా మేరకు చేయడం ఉత్తమం.


ఉపవాసాలకూ దూరంగా ఉండాలి. ఉప‌వాసం చేసేవారికి ఈ మైగ్రేన్ వ‌చ్చే అవ‌కాశం ఎక్కువ‌. అలానే ఒక్కపూట భోజనం కాకుండా కడుపు నిండా తినడం పోషకాహారానికి ప్రాధాన్యమివ్వడం వంటివి చేయాలి. ఘాటైన పరిమళ ద్రవ్యాలకు దూరంగా ఉండాలి. ఎండలో బయటకు రాకుండా ఉండాలి. ఒకవేళ రావాల్సి వస్తే చలువ కళ్లద్దాలు పెట్టుకోవాలి. శబ్దాలకు దూరంగా విశ్రమించాలి.


వాతావరణంలో మార్పులు చోటు చేసుకున్నప్పుడు ఈ సమస్య రెట్టింపవుతుంది. అలాంటప్పుడు బయటకు రాకుండా ఉండటం. చెవుల్లోకి చలిగాలి పోకుండా దూదిపెట్టుకోవడం అలవాటు చేసుకోవాలి. ఆ సమయంలో బాగా నిద్రపోవడం వల్ల ఉపశమనం లభించే అవకాశం ఉంటుంది. ఉదయం పడకతో పాటు యోగా, వ్యాయామం కూడా చేయమన్నది నిపుణుల సలహాలు పాటించండి.  ఆహారనియమాల పట్ల శ్రద్ధ పెట్టాలి. 




మరింత సమాచారం తెలుసుకోండి: