'ఉప్పు' మనం తినే వంటల్లో ఖచ్చితంగా ఉండాల్సిన పదార్ధం అది. ఉప్పు లేదు అంటే ఏంటి ఈ కూర.. ఏంటి ఈ భోజనం అని అంటాము. కానీ ఉప్పుని అన్నంలో అస్సలు కలపకూడదు అంట. ఉప్పు అన్నంలో కలిస్తే ఎంత కోటీశ్వరుడైన అయినా సరే బికారి అవ్వాల్సిందేనట. ఇది మేము చెప్పడంలేదు కొందరు మహానుభావులు చెప్తున్నారు. 


ఉప్పు ఎవరి దగ్గర తీసుకోకూడదు అని చెప్తుంటారు. నిజమే ఉప్పు తీసుకున్నాము అంటే మనము ఖచ్చితంగా అప్పులు పలు అవుతాము అని మనం నమ్ముతుం. ఇది నిజమో కాదో తెలీదు కానీ అప్పులపాలవుతాం అనే భయంతో ఉప్పుని కొంటాము కానీ ఎవరి దగ్గర అప్పుగా తీసుకోము. ఇది మన అలవాటు. ఒక విధంగా చెప్పాలంటే ఇది మన ముద్ర నమ్మకం కూడా. 


అలానే ఉప్పుని అన్నంలో కలపకూడదు అనేది కూడా మన ముద్ర నమ్మకమే. కానీ కొంతమంది చెప్పేవి నిజాలు అనిపిస్తాయి. మన తెలుగు రాష్ట్రాల్లోనే చుడండి. రాయలసీమ జిల్లాలు అన్ని అన్నంలో ఉప్పు లేకుంటే భోజనం చెయ్యలేరు. వారు కూరలో ఉప్పు తక్కువ వేసి అన్నంలో ఉప్పు ఎక్కువ కలుపుకుంటారు. ఇంకా కోస్తా ఆంధ్రకి వస్తే వారు కూరలో ఎక్కువ ఉప్పు వేసుకుంటారు, అన్నంలో తక్కువ ఉప్పు వేసుకుంటారు. 


అంటే రాయలసీమ జిల్లాలు అన్నంలో ఉప్పు తినడం వల్లే కరువు ప్రాంతాలు అయ్యాయని, కోస్తాఆంధ్ర అన్నంలో ఉప్పు వేసుకోదు కాబట్టి మంచి డబ్బు ఉన్న ప్రాంతాలు అయ్యాయి అని కొందరు విశ్వసిస్తుంటారు. మరి నిజమెంత అనేది తెలియాల్సి ఉంది. 


మరింత సమాచారం తెలుసుకోండి: