గతకొన్నేళ్ళుగా భూమి అంతరించి పోతుంది. ప్రళయం వచ్చేస్తుంది అంటూ ఎన్నో రకాల ఊహాగానాలు వినిపిస్తూనే ఉన్నాయి. అయితే ఇప్పటి వరకు జరిగిన వినాశనాల సుమారు ఐదు సార్లు జరిగాయని చరిత్ర చెప్తూనే ఉన్నా అమెరికాలోని శాస్త్రవేత్తలు మాత్రం ఇప్పటివరకూ వచ్చిన ప్రళయాలు  ఐదు కాదని మొత్తం ప్రళయాలు ఆరు జరిగాయని గత కొన్నేళ్లుగా పరిశోధనలు చేసిన అనంతరం ఈ విషయాన్ని ధ్రువీకరించారు.

 

అంతేకాదు చివరిసారిగా జరిగిన ఆరో వినాశనం దాదాపు 26 కోట్ల సంవత్సరాల క్రితం జరిగిందని ప్రకటించారు. అయితే ఈ వినాశాలు అన్నీ ఒకేఒక్క కారణంవలన జరిగాయని, అందుకు కారణం పర్యావరణ వినాశనమేనని అంటున్నారు. ప్రళయం వచ్చిన ప్రతీ సారి భూమిలో ఉండే అగ్నిపర్వతాలు బద్దలయ్యి లక్షల కిలోమీటర్ల మేరకు లావా ప్రవహించడంతో యుగాంతాలు జరిగేవని తెలిపారు. అయితే

 

ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే మళ్ళీ ప్రళయం వచ్చే అవకాశాలు ఉన్నాయని. మనిషి అభివృద్ధి చాటున చేస్తున్న పర్యావరణ హాని భవిష్యత్తులో భూమి  అంతం అయ్యే దిశగా వెళ్తోందని హెచ్చరిస్తున్నారు. టెక్నాలజీ అనేది మనిషి మనుగడకి ఉండాలి కానీ మనిషి వినాశనానికి దారి తీయకూడదు అంటున్నారు.   

 


మరింత సమాచారం తెలుసుకోండి: