సాధార‌ణంగా చూయింగ్ గమ్‌ పిల్లలతో పాటు పెద్దలు కూడా దీనిపై ఆసక్తి చూపుతుంటారు. కొంత మంది అదే పనిగా చూయింగ్ గమ్ నములుతుంటారు.దీనిని నమలడానికి ఓ స్టైల్ గా భావిస్తుంటారు. ముఖ్యంగా టీనేజీ కుర్రాళ్లకు అదో ఫ్యాషన్. వీళ్ల‌కు ఇది ఒక వ్యవసనంగా మారిందని చెప్పవచ్చు. ఈ చూయింగ్ నమలడం వల్ల అనే దుష్ప్ర‌భావాలు ఉన్నాయని వైద్యులు పేర్కొంటున్నారు. అయితే రుచికి తియ్యగా ఉండే ఈ చూయింగ్‌ గమ్‌ల వల్ల ఆరోగ్యానికి హాని కలిగిస్తుంద‌ట‌.


చూయింగ్‌ గమ్‌లు, మేయోన్నైస్‌లను నిత్యం తీసుకోవడం వల్ల కొలన్‌ క్యాన్సర్‌ (పేగులకు వచ్చే క్యాన్సర్‌) వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని పరిశోధనల్లో తేలింది. వాటిలో ఉండే ఓ రకమైన రసాయనం మన జీర్ణవ్యవస్థపై ప్రభావం చూపుతుందట. ముఖ్యంగా చిన్న ప్రేగులపై ఆ కెమికల్ ప్రభావం ఉంటుందని పరిశోధనలో తేలింది. చూయింగ్‌  గమ్‌ తరచూ తినడం వల్ల వీటి నుంచి విడుదలయ్యే బ్యాక్టీరియా మన పేగుల్లోకి చేరుతుంది.


క్రమంగా అది పేగులకు హాని చేస్తూ క్యాన్సర్‌గా మారుతుందని పరిశోధనలో గుర్తించారు. అదే పనిగా చూయింగమ్‌ని తింటే దంతాలు దెబ్బతినే ప్రమాదం ఉంది. అలాగే గమ్‌ను నమలడం వల్ల‌ జాయింట్స్‌ అంటే పండ్ల దవడల సమస్యలు పెరుగుతాయి. అంతర్గతంగా జాయింట్స్‌, కండరాల నొప్పి కలిగిస్తుంది. బ‌రువు కూడా పెరిగేందుకు ఛాన్స్ ఉంది. కనుక చూయింగ్ గమ్‌లను ఎక్కువగా తినే అలవాటు ఉన్నవారు దాన్ని మానుకుంటే ఉత్త‌మం.  



మరింత సమాచారం తెలుసుకోండి: