ఆడపిల్లలకు బయటే కాదు … ఇంట్లో కూడా రక్షణ లేకుండా పోతోంది.  కొంత మంది కామాంధులు కన్నబిడ్డలనే కాటేస్తున్న సంఘటనలు ఇటీవల చోటుచేసుకుంటున్నాయి.  వరసకు  తాత,  మామ,  బాబాయ్ అయ్యేవాళ్ళు   ఇంట్లోని  ఆడపిల్లలపై కన్నేసి  వారిని  చెరబట్టిన ఉదంతాలను మనం ఎన్నో చూశాం .  కంటిని  కనుపాపల సంరక్షించుకోవాల్సిన ఓ కన్న తండ్రే , సొంత కూతురిపై గత మూడు నెలలుగా  అత్యాచారం చేస్తోన్న సంఘటన ఆలస్యంగా  వెలుగులోకి వచ్చింది. చిన్న కూతురిపై తండ్రి అత్యాచారం చేయడాన్ని గమనించిన పెద్ద కూతురు తల్లికి చెప్పడం తో , ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది .


 ఈ దారుణం  వరంగల్ అర్బన్ జిల్లా హన్మకొండలో చోటు చేసుకుంది . మహబూబాబాద్ జిల్లా కు చెందిన కుమారస్వామి వృత్తిరీత్యా  కారు డ్రైవర్ . కారు డ్రైవర్ గా  పనిచేస్తూ హన్మకొండలోని కె.ఎల్.ఎన్ రెడ్డి కాలనీ లో కుటుంబంతో కలిసి నివసిస్తున్నాడు.  కుమారస్వామి తన చిన్న కూతురు లైంగికంగా లొంగదీసుకుని  గత మూడు నెలలుగా ఆ చిన్నారిపై  అత్యాచారం చేస్తున్నట్లు అతని భార్య ... పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదు లో పేర్కొంది . సభ్య సమాజం తలదించుకునే ఈ సంఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు వేగవంతం చేశారు .


 ఆడకూతుళ్ల ఇంట్లోనూ , బయట మృగాళ్ల వల్ల రక్షణ లేకుండా పోతుందని , ఆడకూతుళ్ళను లైంగికంగా వేధించే వారిని కఠినంగా శిక్షించాలని మహిళా సంఘాల ప్రతినిధులు డిమాండ్ చేస్తున్నారు . ఆడవాళ్ళ పై అత్యాచారం చేసిన దోషులను కఠినంగా శిక్షించేందుకు ఫాస్ట్ ట్రాక్ కోర్టులను ఏర్పాటు చేయాలని కోరుతున్నారు .  సమాజం లో ఆడవారిపై రోజుకింత అత్యాచారాలు పెరిగిపోతున్నాయని మహిళా సంఘాల ప్రతినిధులు ఆందోళన వ్యక్తం చేస్తూ  , దీనికి ప్రభుత్వాలు అనుసరిస్తున్న ఉదాసీన వైఖరే కారణమని  విమర్శిస్తున్నారు .


మరింత సమాచారం తెలుసుకోండి: