ఉదయం లేవగానే చాలామందికి కాఫీ చాలా ముఖ్యమైనది. కాఫీ తాగితే చాలామందికి ప్రశాంతత లభిస్తుంది. మరికొంతమందికి కాఫీ తాగకపోతే రోజు గడవదు. మరికొంతమంది అయితే కాఫీని రోజుకు మూడు నాలుగు సార్లు తాగుతారు. కాఫీ అంటే అంత పిచ్చి ఉంటుంది చాలామందికి. అయితే కాఫీ తాగడం చాల ప్రమాదం అని కొందరు చెబుతుంటారు. 


రోజు కాఫీ తాగితే క్యాన్సర్ వస్తుందని కొందరు బయపెడుతుంటారు. కానీ కాఫీ తాగటం వల్ల ఎలాంటి ప్రమాదం రాదు. నిత్యం కాఫీ తాగటం వల్ల క్యాన్సర్ వచ్చే అవకాశాలు చాల తక్కువగా ఉంటాయని సైంటిస్టులు తెలిజేశారు.  జపాన్ లోని కనజావా యూనివర్సిటీకి చెందిన పలువురు శాస్త్రవేత్తలు తాజాగా 16 ఎలుకలపై ఈ పరిశోధన చేశారు. వాటికి కాఫీ పౌడర్ ఇచ్చి.. వాటిపై పరిశోధనలు చేశారు. 


ఆ పరిశోధన ద్వారా కాఫీలో ఉండే కహావోల్ ఎసిటేట్, కేఫ్ స్టాల్ అనే సమ్మేళనాలు ప్రోస్టేట్ క్యాన్సర్ రాకుండా చూస్తాయని వారు కనుగొన్నారు. అంతేకాదు క్యాన్సర్ కణాల పెరుగుదలను కూడా కాఫీ అడ్డుకుంటుంది అని వారు గుర్తించారు. అందువల్ల ప్రతిరోజు కాఫీ తాగితే.. క్యాన్సర్ రాకుండా చూసుకోవచ్చని జపాన్ శాస్త్రవేత్తలు  చెబుతున్నారు. 


కాగా కాఫీ తాగితే క్యాన్సర్ రాదని అదే పనిగా ఎక్కువ సార్లు కాఫీ తాగినా ప్రమాదం అని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. రోజుకు 2 లేదా 3 సార్లు కాఫీ తాగితే ఫర్వాలేదు గానీ అంతకన్నా ఎక్కువ తాగడం వల్ల ఆరోగ్య సమస్యలు ఎదురవుతాయని సైంటిస్టులు అంటున్నారు. రోజు కాఫీ తాగుతూ మితంగా తీసుకుంటే ఆరోగ్యానికి మంచిది. 


మరింత సమాచారం తెలుసుకోండి: