ఊబకాయం.. ఇప్పుడు 100 శాతం ప్రజల్లో దాదాపూ 60 శాతం మంది ఊబకాయం వల్ల బాధపడుతున్నారు. లావు తగ్గాలని అందరికి ఉంటుంది కానీ అంత ఈజీగా లావు తగ్గితే అది ఊబకాయం ఎందుకు అవుతుంది. చాలామంది ఈ ఊబకాయం వల్ల మానసికంగా కుంగిపోతుంటారు. లావు అయ్యాము అనే ఫీలింగ్ తో ఇంటి నుంచి బయటకు రావడానికి కూడా సిగ్గుపడుతుంటారు.  


పెద్దలు అంటుంటారు.. మగాడు తిరక్క చెడితే, ఆడది తిరిగి చెడింది అని సామెత చెప్తుంటారు. ఆ సామెత ఇక్కడా కరెక్ట్ గా సరిపోతుంది. కొంతమంది అధికంగా తిని లావు అవుతే మరికొంతమంది తినక గ్యాస్ ఫార్మ్ అయ్యి లావు అవుతారు. ఏమైతేనేమి లావు అయితే అయ్యారు కదా.. ఇప్పుడు ఇద్దరి సమస్య లావు తగ్గడమే. 


లావు తగ్గాలంటే బంకమట్టి తినాలని.. అది కూడా చెప్పాము కదా అని ఎలా అంటే ఆలా తినకూడదని.. పరిశోధకులు సూచించిన బంకమట్టినే తినాలని సూచిస్తున్నారు పరిశోధకులు. వివరాల్లోకి వెళ్తే పరిశోధకులు కొన్ని ఎలుకలకు ఒబేసిటీ మెడిసిన్, మరికొన్ని ఎలుకలకు ప్రాసెస్డ్‌ బంక మట్టిని ఆహారంగా ఇచ్చారు. 


ఇలా రెండు వారాల అనంతరం మట్టిని తిన్న ఎలుకల్లో బరువు తగ్గడం గుర్తించారు. బంకమట్టిలోని సన్నటి మురికి లాంటి పదార్థం పేగుల్లోని కొవ్వును పీల్చేస్తుందనీ, అయితే ఇది మనుషుల మీద ఎంత ప్రభావాన్ని చూపుతుందో తెలుసుకోవడానికి మరిన్ని ప్రయోగాలు అవసరమని వారు చెబుతున్నారు. మట్టిని నేరుగా తినకపోయినా, మట్టి పాత్రలలో తయారు చేసిన ఆహారాన్ని తింటే బరువు తగ్గుతారని సూచిస్తున్నారు పరిశోధకులు. మరి మీరు కూడా మట్టిపాత్రలలో తిని ఒకసారి ట్రై చెయ్యండి. 



మరింత సమాచారం తెలుసుకోండి: