మనిషి జీవితంలో ఆనందం అనేది ఎంత ముఖ్యమంటే దాని గుర్తింపును ఎంత చెప్పిన తక్కువే.మనిషి,మణి షి అయ్యి సంతోషాలను,ఆనందాలను పక్కనబెట్టి పరుగులు పెడుతున్నాడు కాని ఎంత డబ్బు ఇవ్వలేని సంతోషం,ఆనందం ఈ ప్రపంచంలో కొన్నీంటివల్ల ఖర్చు లేకుండా లభిస్తుంది.కొందరికి తిండిలో దొరికితే.మరి కొందరికి జర్నీలో దొరుకుతుంది.ఇలా ఎవరి స్ధాయికి తగ్గట్టుగా వారు సంతోషాల్ని వెతుక్కుంటారు,.ఇంకొందరు మాత్రం శృంగారంలో అంతులేని ఆనందాలను, సుఖాలను అనుభవిస్తారు.



ఈ శృంగారం అనేది ఈ భూమిమీదవున్న ప్రతి ప్రాణి చేసే చర్యనే.చాలామంది పురుషులు తమ భాగస్వామితో శృంగారం తర్వాత వెంటనే నిద్రలోకి జారుకుంటారు.అయితే మహిళలు మాత్రం వెంటనే శృంగార మోహం నుంచి పూర్తిగా బయటకు రారు.శృంగారం తర్వాత మరికొంత సేపు సున్నిత రొమాన్స్ లేదా రొమాంటిక్ టాక్‌ను ఇష్టపడుతారు.కానీ పురుషులకు మాత్రం నిద్ర తన్నుకొచ్చేస్తుంది.అయితే ఇలా శృంగారం తర్వాత పురుషులు వెంటనే హాయిగా నిద్రలోకి జారుకోవడానికి పలు కారణాలున్నాయని నిపుణులు చెబుతున్నారు.



ఎందుకంటే శృంగారం ముగిసిన తర్వాత మెదడులో జరిగే ఎడెనోసిన్ రసాయన ప్రభావంతో నిద్ర కమ్ముకువస్తుందని సెక్సాలజిస్టులు చెబుతున్నారు.శృంగారంలో భావప్రాప్తి తర్వాత పురుషుడి శరీరంలో చాలా రకాల రసాయనాలు విడుదల అవుతాయి.అందులో నైట్రిక్ ఆక్సైడ్,నైట్రిక్ యాసిడ్,ఆక్సిటోసిన్,ప్రొలాక్టిన్‌తో పాటు మరికొన్ని ఉంటాయి. ఇవన్నీ ఒకరకంగా నిద్రకు ఉత్ప్రేరకాలుగా పనిచేస్తాయి.సాధారణ సమయాల్లో కంటే శృంగారం తర్వాత పురుషుడిలో విడుదలయ్యే ప్రొలాక్టిన్ రసాయన ప్రభావం నాలుగు రెట్లు ఎక్కువగా ఉంటుంది.కాబట్టి నిద్ర ముంచుకొచ్చేస్తున్న ఫీలింగ్ కలుగుతుందట,ఇక శృంగారంలో భావప్రాప్తి అనే ముఖ్య ఘట్టం,ఆసమయంలో కొంచెం కండరాల పై ఒత్తిడి పెరుగి అలసినట్టుగా అనిపిస్తుంది కాబట్టి అది ముగిసిన తర్వాత శరీరం పూర్తిగా రిలాక్స్‌లోకి వెళ్తుందని నిద్ర రావడానికి కూడా ఇది ఒక కారణమని సెక్సాలజిస్టులు చెబుతున్నారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: