పన్నీర్ .. శాకాహారులకు ఇదే నాన్ వెజ్. పన్నీర్ అంటేనే చాలామంది పెదాలను తడుముకుంటారు. కారణం పన్నీర్ అంత రుచికరంగా ఉంటుంది. ముక్క తర్వాత పన్నీర్ కర్రీని అంత రుచి. ఎప్పటి నుంచో ఈ పన్నీర్ వంటకాలు ఉన్నాయి. ఈ పన్నీర్ ని మన దేశంలో నార్త్ ఇండియన్స్ ఈ పన్నీర్ ని ప్రతిరోజు ఏదొక సమయంలో స్నాక్స్ గానో, లాంచ్ గానో ఎలాగోల తింటారు. 


అయితే పన్నీర్ కర్రీ కేవలం నాలుకకే కాదు శరీరానికి కూడా చాలామంచిది. అయితే పన్నీర్ తినడం వల్ల భారీగా లావు అయిపోతారు అని, కొలస్ట్రాల్ పెరుగుతుందని అందరూ అంటుంటారు. కారణం ఇది పాల వస్తువు కాబట్టి. కానీ పన్నిర్ లో అలాంటి సమస్యలు ఏవి ఉండవట. పన్నీర్ తింటే ఇంకా కొవ్వు కరుగుతుందట. రక్తంలోని షుగర్ లెవల్స్ కంట్రోల్ చేస్తుందట. ఇవి మాత్రమే కాదట పన్నిర్ వల్ల చాల ప్రయోజనాలు ఉన్నాయట. అవేంటో ఒకసారి చుడండి ఇక్కడ. 


పన్నీర్‌ను రోజువారీ ఆహారంలో చేర్చుకుంటే.. గుండె జబ్బులు రాకుండా కాపాడుతుంది, ఎర్ర రక్తకణాల అభివృద్ధికి సహకరిస్తుంది, మధుమేహం రాకుండా నిరోధిస్తుంది, పన్నీర్‌తో ఎముకలు, దంతాలు ధృఢంగా ఉంటాయి, శరీరంలోని కొవ్వును కరిగిస్తుంది, గర్భంలోని పిండాభివృద్ధికి సహకరిస్తుంది, రొమ్ము క్యాన్సర్‌ను నివారిస్తుంది, వెన్నునొప్పి, కీళ్ల బాధల్ని తగ్గిస్తుందట. ఇన్ని ప్రయోజనాలు ఉన్న పన్నీర్ ని రోజు ఆహారంలో చేర్చుకోండి ఆరోగ్యాంగా ఉండండి. 


మరింత సమాచారం తెలుసుకోండి: