బీర్.. ఈ కాలంలో అమ్మాయిలు, అబ్బాయిలు అని తేడా లేకుండా స్టైల్ అని అదని, ఇదని తేగా తాగేస్తున్నారు. కొంతమంది అబ్బాయిలు అయితే బ్బధాలను మర్చిపోడానికి అని, పనిలో ఒత్తిడిని దూరం చేసుకోవాలని తెగ తాగేస్తుంటారు. ఇంకా చాలామంది మద్యాన్ని నీళ్లలా తాగి రోడ్లపై తాగి తుళ్లుతున్నారు. వీకెండ్ వచ్చిందంటే మద్యం తాగకుండా అసలు ఉండలేరు. 


వీకెండ్ లో మద్యం తీసుకోకపోతే అది వీకెండ్ కాదు అని అంటుంటారు. అయితే మద్యం సేవించే వారిలో కొంతమంది అనుకోని రీతిలో భారీగా లావు అయిపోతారు. అసలు వారు ఆలా ఎందుకు లావు అవుతారు అనేది ఎవరికి అంతుచిక్కడం లేదు. దీంతో తాజాగా ఓ లండన్ పరిశోధకులు ఎందుకు లావు అవుతారు అనేది తేల్చి చెప్పారు.  


మద్యంలో ఉండే అధికమైన క్యాలరీలు.. తాగే సమయంలో తీసుకునే ఆహార పదార్ధాల వల్ల కొలెస్ట్రాల్ ఎక్కువై శరీరం లావెక్కుతుందని వారు చెప్పారు. మద్యంలోని కొవ్వుతో పాటు తీసుకునే ఆహారంలోని కొవ్వు కూడా ఆల్డ్ 1 ఏ1 అనే ఎంజైమ్‌గా మారి కొలెస్ట్రాల్ రూపంలో శరీరానికి బాగా ఎఫెక్ట్‌ అవుతుందని వారు అన్నారు. ఇక రక్తంలో మద్యం ఎక్కువైతే శరీరంలోని గ్లూకోగాన్ హార్మోన్ పని చేయడం మానేస్తుందని దంతో షుగర్ వ్యాధి తొందరగా రావడానికి ఆస్కారం ఉంటుందని పరిశోధకులు తేల్చారు. మరి ఇన్ని విషయాలు తెలుసుకొని అందంగా ఉండే మీరు పొట్ట ముందుకు తెచ్చుకుంటాము అనుకుంటే మీ ఇష్టం మరి. 


మరింత సమాచారం తెలుసుకోండి: