స్మార్ట్ ఫోన్.. ఉదయం లేచినప్పటి నుండి ఖచ్చితంగా చేతిలో ఉండాల్సింది. ఈ కాలంలో 24 గంటలు తిండి లేకపోయినా బతుకుతారు కానీ ఒక్క గంటసేపు ఫోన్ కనిపించకపోతే ఏదో జరిగిపోయింది అన్నట్టు వ్యవహరిస్తారు. కానీ ఫోన్ వల్ల చాల ప్రమాదాలు జరుగుతాయి. అతిగా అంటే అతిగా ఫోన్ ని వినియోగిస్తున్నారు. స్మార్ట్ ఫోన్ వాడటమే పనిగా వాడుతారు. 


అయితే ఓ యూనివెర్సటి విద్యార్థులు పరిశోధనలో ఓ అధ్యయనం చేపట్టారు. 6 గంటలు లేదా అంతకంటే ఎక్కువ సేపు ఫోన్ వినియోగిస్తా లావు అయ్యే అవకాశాలు 43 శాతం ఎక్కువగా ఉన్నాయని ఆ అధ్యయనంలో తేలింది. ఇక స్మార్ట్ ఫోన్ ఎక్కువగా వినియోగించటం వల్ల మన జీవన శైలిలోనూ మార్పు వస్తుంది. ఫలితంగా గుండె సంబంధిత వ్యాధుల బారిన పడే ప్రమాదం ఉందని పరిశోధకులు చెప్తున్నారు.


స్మార్ట్ ఫోన్ టెక్నాలజీ నేటి తరాన్ని చాలా అక్కట్టుకుంటుండటం నిజమే. దీని వల్ల ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి. అయితే మరోవైపు కొన్ని ప్రమాదాలు కూడా ఉన్నాయి. స్మార్ట్‌ఫోన్‌లో గంటల తరబడి గడపడం వల్ల శారీరక శ్రమ భారీగా తగ్గుతుంది. దీని వల్ల ఊబకాయం, షుగరు, గుండె సంబంధిత వ్యాధులు, కొన్ని రకాల క్యాన్సర్ల బాడిన పడే ప్రమాదం ఉంది అని రీసర్చ్‌ చేసిన విద్యార్థులు చెబుతున్నారు. మీరు లావు అవుతున్నారా ? అయితే ఖచ్చితంగా అందులో మీ స్మార్ట్ ఫోన్ పాత్రా ఎంతో ఉంటుంది. 


మరింత సమాచారం తెలుసుకోండి: