ఒక గ్లాస్ ఆరెంజ్ జ్యూస్ తాగితే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయని అంటున్నారు డాక్టర్లు. ముఖ్యంగా ఆరెంజ్ జ్యూస్ వల్ల అమ్మాయిలకు ఎన్నో ప్రయోజనాలు ఉంటాయట. వృద్ధులకు అయితే చెప్పలేనన్ని ప్రయోజనాలు. అవి ఏంటో ఇక్కడ చదివి తెలుసుకోండి. 


చిన్నపిల్లల నుండి పెద్దవారి వరుకు ప్రతి ఒక్కరు ఆరెంజ్ జ్యూస్ తీసుకోవడం వల్ల ప్రాణాంతకమైన స్ట్రోక్స్ వచ్చే అవకాశాలు తక్కువగా ఉంటాయని అంటున్నారు పరిశోధకులు. ఇటీవలే చేపట్టిన పరిశోధనలో ఇది వెల్లడైందట. ఈ సదరు పరిశోధకులు చెందిన వివరాలను బ్రిటిష్ జర్నల్ ఆఫ్ న్యూట్రిషన్ లో ఇది ప్రచురించారు. 


కాగా నిత్యం ఆరెంజ్ జ్యూస్ తాగే వారిలో బ్రెయిన్ క్లాట్ అయ్యే అవకాశాలు 24 శాతం వరకు తక్కువ ఉంటాయని, అలాగే గుండె జబ్బులు వచ్చే అవకాశం 12 నుంచి 13 శాతం వరకు తక్కువగా ఉంటుందని అంటున్నారు. కాగా ఈ ఆరెంజ్ జ్యుసి అమ్మాయిలు తాగడం వల్ల చర్మకాంతి లభిస్తుందని అంటున్నారు పరిశోధకులు. ఇందుకు కేవలం అరేంజ్ జ్యూస్ కాదు ఎలాంటి జ్యూస్ తీసుకున్న చర్మానికి మంచిదే అని అంటున్నారు పరిశోధకులు.


మరింత సమాచారం తెలుసుకోండి: