ఈ మధ్యకాలంలో ఆడపిల్లలు ఉద్యోగరీత్యా నైట్ షిఫ్టులు కూడా పని చేస్తున్నారు.  కొంతమంది మహిళలు అయితే పెళ్ళయాక కూడా ఆర్ధిక సమస్యల కారణంగా సాఫ్ట్ వేర్ ఉద్యుగులు నైట్ షిఫ్ట్ పని చేస్తున్నారు. అయితే ఆలా పని చెయ్యడం కారణం వల్ల గర్భంతో ఉన్న ఆడవాళ్లకు చాల ప్రమాదమని పరిశోధకులు చెబుతున్నారు. వారానికి మూడు రోజులు నైట్ షిఫ్ట్ చేసిన గర్భస్రావం జరిగే ప్రమాదం ఉందని పరిశోధకులు సూచిస్తున్నారు. 


ఇంకా విషయానికి వస్తే.. ఓ యూనివర్సిటీకి చెందిన పరిశోధకులు ఓ ఆసుపత్రిలో 22,834 మంది గర్భిణీ స్త్రీల సమాచారాన్ని సేకరించారు. ఇక అక్కడ నుండి వారు సేకరించిన సమాచారం ద్వారా ఎంతమందికి గర్భస్రావం జరిగింది ? ఎన్ని వారాలలో జరిగింది ? అనేది తెలుసుకున్నారు. అయితే అక్కడ అందరూ ఆశ్చర్యపోయే విషయం బయట పడింది. గర్భం దాల్చిన ఎనిమిదో వారం నుంచే ఈ ప్రమాదం జరిగినట్టు గుర్తించారు.


వారానికి రెండు లేదా మూడు నైట్ షిఫ్ట్స్ చేసిన మహిళల రిపోర్ట్స్ చూస్తే నైట్ షిఫ్ట్స్‌లో పని చెయ్యని వారికన్నా, వీరిలో 32 శాతం మందికి గర్భస్రావం అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు పరిశోధనలో తెలిసింది. నైట్ షిఫ్ట్స్ చేసే కొద్దీ ఆ రిస్క్ కూడా పెరుగుతూ ఉంటుందని తేల్చి చెప్పారు. కారణం గర్భధారణ సమయంలో మహిళలు ఎక్కువగా పని చేయడం మంచిది కాదు. 


కానీ వీరు మాత్రం ఏకంగా నైట్ షిఫ్ట్స్ చేసి వారిలో అలసత్వం ఉంటుంది. దీంతో అసాధారణమైన క్రోమోజోమ్లు వృద్ధి చెంది.. లోపల ఉన్న పిండం బలహీనమవుతుంది. ఇది తీవ్ర గర్భస్రావానికి దారి తీస్తుంది. గర్భంతో ఉన్న మహిళలు చీకటిలో కన్నా వెలుతురులో ఉండటమే మంచిదని పరిశోధకులు అంటున్నారు. మరి ఇది గమనించి అయినా మహిళలు గర్భంతో ఉన్న సమయంలో నైట్ షిఫ్ట్ చెయ్యరు ఏమో చూడాలి.


మరింత సమాచారం తెలుసుకోండి: