ప్రతిరోజు ఏదో కారణం వల్ల మనకు తలనొప్పి వాస్తు ఉంటుంది. ఉదయం లేచినప్పటి నుంచి నిద్రపోయే వరుకు క్షణం తీరిక లేకుండా పని చేస్తుంటాం. ఎందరో డిఫరెంట్ మనుషుల మధ్య ఎన్నో ఆలోచనలతో జీవనం గడిపేస్తుంటాం. సమయానికి సరిగ్గా నిద్రలేక, ఆహారం లేకపోవడం, నిలకడలేని ఆలోచనలతో తీవ్ర మానసిక వొత్తిడికి గురయ్యి వ్యాధుల బారిన పడుతుంటారు. 


తలనొప్పి వచ్చింది అంటే ఎంత ప్రశాంత మనసు ఉన్న వారైనా సరే చీటికిమాటికి చిరాకు, కోపం ఎక్కువగా ఉండి ఏ పని కుదురుగా చెయ్యలేరు. చిన్న శబ్దాన్ని భరించలేరు, వెలుతురును సరిగ్గా చూడలేకపడం.. కళ్లకు చీకటి వచ్చినట్లుగా అనిపిస్తుంది. ఇవీ తలనొప్పి లక్షణాలు. ఇక ఏ తలనొప్పినైనా పెయిన్‌ కిల్లర్‌తో సరిపెట్టడం ఆరోగ్యానికి ఎంత మాత్రం మంచిది కాదు. అందుకే తల నొప్పి వచ్చిన సమయంలో ఇలాంటి చిన్న చిట్కాలను పాటించండి. 


తలస్నానం చేసిన చేసిన ప్రతి సారి తలను పూర్తిగా ఆరబెట్టుకుంటే తల నొప్పి రాదు, ఎండ ఎక్కువ ఉన్న సమయంలో నీళ్లను బాగా తీసుకోవాలి, అలాగే కొన్ని కొన్ని సార్లు మనకు సరిపడని సెంటుని ధరించిన తలనొప్పికి దరి తీస్తుంది. అలంటి సమయంలో సెంటుని ధరించకపోవడం మంచిది. తలనొప్పి ఉన్న సమయంలో ఫోన్, ల్యాప్ టాప్, కంప్యూటర్ వంటి వాటికీ దూరంగా ఉండటం ఉత్తమం. ఇవి అన్ని పక్కన పెట్టిన .. శరీరానికి కావాల్సినంత ఆహారం, కావాల్సినంత నిద్ర తీసుకుంటే అసలు ఎలాంటి తలనొప్పి లేకుండా ఉత్సాహంగా ఉంటారు.


మరింత సమాచారం తెలుసుకోండి: