అమ్మయికి 16 ఏళ్ళు వచ్చాయి అంటే ప్రతి అమ్మాయి అందంగా కనిపించాలని అందంపై తగిన జాగ్రత్తలు తీసుకుంటుంది. ఆలా 16 ఏళ్ళ వయసులో తీసుకున్న శ్రద్ద ఎల్లప్పుడూ తీసుకోలేరు. అందుకే నలబై ఏళ్ళు వచ్చేసరికి అందరూ ఆడవాళ్లు వృద్దులుగా కనిపిస్తారు. అయితే ఆరోగ్యాంగా, అందంగా ఉండాలంటే కొన్ని జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోవాలి. ఇప్పటిదాకా ఉన్న కొన్ని అలవాట్లను మానుకొని మరికొన్నింటిని చేర్చికోవాలి. అవేంటో ఒకసారి ఇక్కడ చదవండి. 


ఆహారాన్ని కొద్ది మోతాదులో ఎక్కువసార్లు తీసుకోవాలి. దీనివల్ల జీవక్రియల వేగం పెరుగుతుంది. ఆకలీ త్వరగా వేయదు. మూడు భోజనాలు, రెండు అల్పాహారాలు తీసుకోవడం వల్ల బరువు అదుపులో ఉంటుందని కొన్ని పరిశోధనలు చెబుతున్నాయి.


కొవ్వు పదార్థాలు అన్ని శరీరానికి హాని చేస్తాయనుకోకూడదు. శాచురేటెడ్‌ కొవ్వు పదార్థాలను ఎంచుకోవాలి. ఇందుకోసం ఆలివ్‌నూనె, నట్స్‌, వాల్‌నట్లు, అవిసెగింజలు వంటివి తీసుకోవాలి.


ఎట్టి పరిస్థితుల్లోనూ ఉదయం తీసుకునే అల్పాహారం మానకూడదు. ఎంత పనిలో ఉన్నా... ఏదో ఒకటి తినాలి.


 మీరు తీసుకునే రోజువారీ ఆహారంలో తాజా పండ్లు, కాయగూరలు, ఆకుకూరలు ఉండేలా చూసుకోవాలి.


చక్కెరను వీలైనంత తక్కువగా తీసుకుంటే... ఆరోగ్యమే కాదు, చర్మమూ తాజాగా ఉంటుంది.


కంటి నిండా నిద్ర చాలా రకాల సమస్యలకు చెక్‌ పెడుతుంది. నిద్రలేమి వల్ల గుండెజబ్బులు, ఊబకాయం, ఆందోళన వంటి ఇబ్బందులు ఎదురవుతాయి. సో ఇక్కడున్నవి చెప్పినవి అన్ని పాటించి అందంగాను ఆరోగ్యాంగాను ఉండండి. 



మరింత సమాచారం తెలుసుకోండి: