ఐబ్రోస్.. మొఖానికి అందం తెచ్చేవి. అలాంటి ఐబ్రోస్ అందంగా, ఒత్తుగా ఉంటె ఇంకా అందంగా కనిపిస్తారు. మరి ఐబ్రో సన్నగా ఉన్నవారికి ఒత్తుగా పెరగాలంటే ఈ చిట్కాలను ఫాలో అవ్వాలి. ఐబ్రోలు వత్తుగా పెరగటానికి కొబ్బరి పాలు ఎంతో సహాయం చేస్తాయి. ఇప్పుడు ఎలా చెయ్యాలో ఒకసారి ఇక్కడ చదవండి. 


కొబ్బరి ముక్కను బాగా మెత్తగా పేస్ట్ చేసి ఆ పేస్ట్ ద్వారా వచ్చే పాలను కనుబొమ్మలపై అప్లై చేసి మసాజ్ చేసుకోవాలి. 


అలాగే మెంతులను రాత్రంతా నీటిలో నానబెట్టి, ఉదయం పేస్ట్ చేసి ఐబ్రోలకు పట్టించాలి. ఇలా పట్టించడం వల్ల కూడా ఐబ్రోస్ అందంగా వత్తుగా పెరుగుతాయి. 


నిమ్మతొక్కను రెండుగా కట్ చేసి ఒక స్పూన్ పాలలో మిక్స్ చేసి, ఈ మిశ్రమాన్ని కనుబొమ్మలకు పట్టించి, మసాజ్ చేయాలి. నిమ్మరసాన్ని ఎప్పుడు నేరుగా కళ్ళకు పట్టించకూడదు. 


మందారం నూనె లేదా మందార పువ్వుల యొక్క పేస్ట్ ను కనుబొమ్మలకు అప్లై చేసి, మసాజ్ చేసి15నిముషాలు ఉంచి తర్వాత నీళ్ళతో కడిగేయాలి. ఇలా వారానికి ఒకసారి చేస్తే మిశ్రమ ఫలితం ఉంటుంది. 


ఈ చిట్కాలలో ఏ ఒక్కటి క్రమంగా ఉపయోగించిన మిశ్రమ ఫలితం ఉంటుంది. మరి ఇంకెందుకు ఆలస్యం. ఒకసారి ఉపయోగించి చుడండి. 


మరింత సమాచారం తెలుసుకోండి: