ల్యాప్‌టాప్‌ ఎక్కడైనా ఎలా అయినా వాడచ్చు. అందుకే ల్యాప్‌టాప్‌ వాడకం బాగా పెరిగింది. కోరుకున్న చోటా కోరుకున్న తీరుగా కూర్చొని పని చేసుకునే అవకాశం మనకు ఈ ల్యాప్‌టాప్‌ ద్వారా ఉంది. అయితే ఇష్టం వచ్చిన స్టయిల్లో కూర్చొని గంటల తరబడి ల్యాప్ టాప్ వాడకం వల్ల ఎన్నో ఆరోగ్యసమస్యలు వస్తాయి. ఈ సమస్యలు ఇప్పటికే చాలామంది టెకీ లకు వచ్చి ఉంటాయి. అయితే ల్యాప్‌టాప్‌ ని ఎలా వాడితే మన ఆరోగ్యం బాగుంటుందో ఇక్కడ చదివి తెలుసుకొండి. 


ల్యాప్‌టాప్‌లను ఒడిలో పెట్టుకొని పని చేయకుండా తగిన ఎత్తున్న టేబుల్ మీద ల్యాప్‌టాప్‌ పెట్టి వాడుకోవాలి. 


ల్యాప్‌టాప్‌ నుంచి దాదాపు 52 సెంటీగ్రేడ్‌ ఉష్ణోగ్రత వస్తుంది. అందుకే ల్యాప్ టాప్ ని వడిలో పెట్టుకోకుండా టేబుల్ పైనా పెట్టుకొనే వాడుకోవాలి. 


ల్యాప్‌టాప్‌ స్క్రీన్‌ కు ముఖం దగ్గరగా పెట్టి చూడకూడదు. ఆలా చూస్తే 'కంప్యూటర్‌ విజన్‌ సిండ్రోమ్‌' అనే నేత్ర సమస్య వస్తుంది. కనుక స్క్రీన్ ను తగిన దూరం నుంచి చూడాలి. అవసరాన్ని బట్టి యాంటీ గ్లేర్ కళ్లద్దాలు వాడాలి.  


రోజంతా ల్యాప్‌టాప్‌ను ఒడిలో పెట్టుకొని పనిచేసేవారికి తొడ భాగంలో చర్మ సమస్యలు వస్తాయి. కొందరిలో ఇది చర్మ క్యాన్సర్‌కి దారి తీసే ప్రమాదం ఉంది. కాబట్టి వీలైనంత వరుకు ల్యాప్‌టాప్‌ ని వడిలో పెట్టుకోకుండా ఉండటం మంచిది. చూశారుగా ఎన్ని సమస్యలు వస్తాయో. కాబట్టి ల్యాప్‌టాప్‌ను వీలైనంత తక్కువ వాడటం మంచిది.


మరింత సమాచారం తెలుసుకోండి: