కోరిక అనేది వినటానికి చిన్న పదమే అయినా దాని పర్యావసనం మాత్రం చాల పెద్దదిగా వుంటుంది.ఇక ప్రతి వ్యక్తి దైనందిన జీవితంలో ఎన్నో ఆటుపోట్లు.మనిషికి క్షణం కూడా తీరిక ఉండటం లేదు.రోజంతా మానసిక ఒత్తిడితోనే గడిచిపోతోంది.టెన్షన్‌ లేని పనంటూ ఏదీ లేదు.పని ఒత్తిడిలో పడి తనకున్న కోరికల్ని తీర్చుకోలేక చాలమంది,తమలోనే అణచుకుంటారు.కాని మహిళలు అలాకాదట.వారికి కొన్ని ఊహాజనకమైన కోరికలు ఉంటాయని మానసిక నిపుణులు అంటుంటారు..అది నిజమో కాదో గానీ కొన్ని కోరికలను మాత్రం బాగా ఇష్టంగా కోరుకుంటారట.తమకు ఇష్టమైన ఆ పని కోసం ఎంత కష్టపడటానికైనా సరే సిద్ధంగా ఉంటారట.ఇంతకీ వారిలో కలిగే ఆ కోరికలేంటో మీరే చూడండి..



ప్రతి మహిళ పెళ్లి అయిన తర్వాత ఎక్కువగా తన భర్త గురించే ఆలోచిస్తుంది.పిల్లలు పుట్టిన తర్వాత వారే లోకంగా,వారి కోసం ఏం చేయడానికైనా సరే సిద్ధంగా ఉంటుంది.అలా మహిళలు కోరుకునే విషయాలలో అతి పెద్ద కోరిక ఏంటంటే..మాకు సొంత ఇల్లు ఉండాలి,నా భర్త పిల్లలతో సంతోషంగా గడపాలని కోరుకుంటుందట. ఇది వినే వాళ్లకు చిన్న విషయం కావచ్చు గానీ మహిళలకు మాత్రం ఇదే పెద్ద కోరికట.ఇక మహిళలు పెళ్లి అయిన తర్వాత ఎక్కువగా ఆనందపడే క్షణాలు గర్భం దాల్చి అమ్మను కాబోతున్నాను అని తెలిసినప్పుడట..అప్పటి నుండి బిడ్డ పుట్టే వరకు నా భర్త నా పక్కనే ఉండాలి.నాకు ఏం కావాలో తనే దగ్గరుండి చూసుకోవాలి,నాకు ఎటువంటి భయం లేకుండా ధైర్యాన్ని ఇవ్వాలని కోరుకుంటారట.ఈ సమయంలో భార్య పక్కనే భర్తలు ఉండటం వలన జీవితంలో ఈ క్షణాలను ఎప్పటికీ మర్చిపోలేరు,మాఆయన చాలామంచివారు గొప్పవారంటూ అందరితో చెప్పుకుంటారు.



సాధారణంగా ఆడవాళ్లకు దుస్తులు,బంగారం అంటే ఇష్టమేనని అందరికీ తెలిసిందే.వాళ్లకు ఫలానా ఆభరణాలు నచ్చితే నాకు ఆ నగలు కావాలని భర్తను ప్రేమగా అడిగి కొనిపించుకుందామని ప్రయత్నిస్తారు..ఇక ఆ భర్త గనుక తమ ఆర్ధిక పరిస్థితి చెబుతూ ఇప్పుడు వద్దులే అని దాటవేసారు అనుకోండి,తాము దాచుకున్న డబ్బును ఇచ్చి మరీ పదండీ షాపింగ్ కు వెళ్దాం అని భర్తను వెంటను తీసుకువెళతారట.కొందరు ఆడపిల్లలు చిన్నప్పటి నుంచి మదిలో కొన్ని అందమైన కోరికలను పెంచుకుంటూ పెరుగుతారు..నేను అలా ఉండాలి,నేను ఇది చేయాలని ఎంతో బలంగా కోరుకుంటూ ఉంటారు.అలా కోరుకునే వాటిలో ఉద్యోగం చేయాలని.అది పెళ్ళికి ముందైనా సరే,పెళ్లి తర్వాత అయినా సరే.పెళ్లి తర్వాత అయితే తన భర్త ఉద్యోగానికి ఒప్పుకుంటే బాగుంటుందని కోరుకుంటారు.ఇక ఉద్యోగం చేయగా వచ్చిన డబ్బుతో ఇలా బ్రతకాలి,వాటిని పలాన వాటికోసం మాత్రమే ఖర్చు చేయాలని అనుకుంటారు.



ఇక కొందరి ఇళ్లల్లో చిన్నప్పటి నుండి ఆడపిల్లలు అనే కారణంగా చాలామంది తమ పిల్లలను ఎక్కడికీ వెళ్లనివ్వరు. తల్లి తండ్రులుగా వారిభయం వారిది.అయితే కొన్ని కొన్ని టూరిజం ప్లేసెస్కు వెళ్లాలని ప్రతి మహిళకు ఉంటుంది కదా.కుటుంబం తో లేదా పెళ్లి అయినతర్వాత భర్తతో అయినా సరే తమకు నచ్చినప్రదేశాలను సందర్శించాలను కుంటారు.అక్కడికి వెళ్లిన తర్వాత హమ్మయ్య ఎన్నో రోజులుగా ఇక్కడికి రావాలనుకుంటున్నాను ఇప్పటికి వచ్చాను,అది మీ వల్లే అంటూ భర్తతో ఆనందంగా చెబుతారు.ఇక ఇలాంటి కోరికలు ఎక్కువగా మధ్య తరగతి ఆడపిల్లల్లో కలుగుతాయట.ముఖ్యంగా ప్రేమ, ఆప్యాయతల మధ్య పెరిగిన పిల్లల్లో ఈ కోరికల మోతాదు కాస్త ఎక్కువగానే ఉంటుందట.


మరింత సమాచారం తెలుసుకోండి: