ఒక మనిషి ఎలా ఉన్నాగాని, ఎంత తెలివైన వ్యక్తిగాని, సాధారణంగా బయటికి వెళ్తే అతని గురించి పెద్దగా ఎవరూ పట్టించుకోరు.  ఇపుడు సమాజం మనిషికి విలువ ఎప్పుడు ఇస్తోంది అంటే... అతను వేసుకున్న బట్టలను బట్టి, అతను ఉపయోగించే వస్తువులను బట్టి, తిరిగే కార్లను బట్టి మనిషికి విలువ ఇస్తున్నది.  మని ఉంటేనే మనిషికి విలువ ఉంటుంది అన్నది ఇప్పటి సమాజం ఉద్దేశ్యం.  


అందుకే ప్రతి ఒక్కరు కూడా ఉన్నా లేకున్నా తన స్టేటస్ ను చూపించుకోవడానికే నీట్ గా రెడీ అయ్యి డ్రెస్ చేసుకొని బయటకు వెళ్తుంటారు.  మాములుగా బయటకు వెళ్ళడానికి ఆసక్తి చూపించరు.  ఎందుకు చూపించరు అంటే కారణం అదే. ఇక ఫ్యాషన్ షోలలో తయారు చేసే డ్రెస్ లు కూడా అలానే ఉంటున్నాయి.  ఇప్పుడు కొత్త స్టైల్ ఏమిటంటే చినిగిన, మాసిన డ్రెస్ లు వేసుకోవడం.  అలాంటి డ్రెస్ లకు రేటు కూడా ఎక్కువే.  


పాపం డబ్బులు లేక సంవత్సరాల తరబడి ఒకటే బట్టలు వేసుకోవడం వలన బట్టలు చినిగిపోతాయి.  అలాంటి బట్టలు వేసుకొని బయటకు వెళ్తే వాళ్ళను ఎవరూ పట్టించుకోరు.  కానీ, ఇప్పుడు కొందరు వేసుకునే బట్టలు కూడా చినిగిపోయి ఉంటున్నాయి.  వాళ్లకు మాత్రం స్టేటస్ ఇస్తారు.  ఇక ఇదిలా ఉంటె, పుర్రెకో బుద్ది అన్నట్టుగా, ఇటీవలే ఓ ఫ్యాషన్ డిజైన్ సంస్థ ఓ డ్రెస్ ను డిజైన్ చేసింది.  


ఆ డ్రెస్ మాములుగా లేదు. చూడటానికి చాలా బాగుంది.  వేసుకోవడానికి కూడా బాగుంటుంది.  కాకపోతే, వేసుకున్నాక..బయటకు వస్తేనే డేంజర్.  సడెన్ గా వాన కురిసిందంటే... నానిపోయి చినిగిపోతుంది.  అదేం డ్రెస్ అని షాక్ అవ్వకండి..ఆ డ్రెస్ ను టిష్యూ పేపర్ తో తయారు చేశారట.  టిష్యూ పేపర్ తో డ్రెస్ ను ఇటీవలే ఓ ఫ్యాషన్ వీక్ లో మోడల్ వేసుకొని హొయలొలికించింది.  ఫ్యాషన్ షోలో వరకు అయితే ఒకే.  బయటకు వస్తేనే డేంజర్.  


మరింత సమాచారం తెలుసుకోండి: