సరైన నూట్రిషనల్ విలువలు, అనారోగ్యకరమైన అహారపదార్ధాలను జంక్ ఫుడ్స్ అంటారు. వాటిల్లో పిజ్జాలు, బర్గర్లు ఇలా అనేక ర‌కాలు జంక్ ఫుడ్స్ ఉంటాయి. అయితే చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్లవరకు ప్రతి ఒక్కళ్లూ పిజ్జాలను తినడం ఫ్యాషన్‌గా మారింది.  కొంత‌ కాలం పాటు.. రోజూ బర్గర్స్, పిజ్జాలు మరియు సాండివిచ్ లు తినేవారిపై రీసెర్చ్ చేయగా అవి తినడం వల్ల కణాల్లోని ధనులపై ఒత్తిడిని ప్రేరేపించాయట. దాని వల్ల అవి వేగంగా పనిచేయడం మొదలుపెట్టాయట. ఇవి క్రమేణా గుండెపోటుకు దారితీస్తాయని శాస్త్రవేత్తలు హెచ్చరించారు.


అలాగే ముఖ్యంగా పిజ్జాలు డైలీ తినే వాళ్లకు లైంగిక చర్య పట్ల ఇంటెస్ట్‌ తగ్గుతుందని, లేకుంటే పూర్తిగా నశిస్తుందని ఓ పరిశోధనలో తేలింది. పిజ్జాలు తిన్న గ్రూపులో 15 శాతం మందిలో లైంగికాసక్తి పూర్తిగా తగ్గిందని గుర్తించారు. అలాగే ఇలాంటి జంక్ ఫుడ్స్ తిన‌ని వారిలో ఎలాంటి తేడాలు లేవ‌ని తేల్చారు. అదే విధంగా పిజ్జాలు బ‌ర్గ‌ర్లు లాంటి ఫుడ్స్ తిన‌డం వ‌ల్ల మెదడుకు ప్రమాదమని స్ప‌ష్టం చేశారు.


ఈ పిజ్జా, బర్గర్లు అదే పనిగా తింటే క్రమేణా మన ఆరోగ్యం ఆవిరైపోతుందని డాక్టర్లు హెచ్చరిస్తున్నారు. దేశంలో ఫాస్ట్‌ ఫుడ్‌ సంస్కృతి శరవేగంగా పెరిగిపోతుంది. ఈ ఫుడ్‌ చాలా ఫాస్ట్‌ గురూ అని పిస్తోంది. అలాగే దేశంలో గత కొన్ని సంవత్స రాలుగా ఫాస్ట్‌ ఫుడ్‌ పరిశ్రమ అనూ హ్యంగా అభివృద్ధి చెందుతోంది. బర్గర్, పిజా, ఫ్రెంచి ఫ్రైస్, కేక్స్, నూడిల్స్... పిల్లలకు నచ్చే జంక్ ఫుడ్. జంక్‌ ఫుడ్‌ తింటే స్థూలకాయం వస్తుంది. ఈ ఊబకాయం వలన చిన్న వయస్సులోనే బిపి, ఆపై షుగర్‌ వస్తుంద‌ని తెలిపారు.


మరింత సమాచారం తెలుసుకోండి: