ప్రస్తుత కాలం మానవుడు ఒకప్పటితో పోలిస్తే ఎప్పటికపుడు రకరకాల నూతన ఆవిష్కరణలతో తన మేధో శక్తికి పదును పెట్టి ముందుకు సాగుతున్నాడు. అయితే అటువంటి వాటితో మనకు మంచితో పాటు కొంత చెడు కూడా జరుగుతుందనుకోండి. అయితే ఆ విషయం అటుంచితే, ప్రస్తుతం మనం వాడుతున్న ఎలక్ట్రానిక్ ఉపకరణాలు, వాహనాలు, వస్తువులు వంటివి రాబోయే యాభై ఏళ్ల తరువాత మరింత అత్యాధునిక రీతిలో ఉడడంతో పాటు, మనకు మరింత సులువుగా మారి, మన సమయాన్ని, శ్రమను ఊహించనంత తక్కువ స్థాయికి తగ్గిస్తాయట. ఇక ఇటీవల శాంసంగ్ సంస్థ లండన్ లో టెక్నాలిజీ యొక్క రాబోయే కాలంలోని నూతన ఆవిష్కృతులకు సంబంధించి ఒక ప్రత్యేక పార్కును ఏర్పాటు చేయడం జరిగింది. అక్కడి ప్రజలను విశేషంగా ఆకర్షించిన ఆ పార్కులో ఎన్నో భవిష్యత్తు ఆవిష్కరణలకు సంబందించిన వింతలు విశేషాలు ఉన్నాయి. 

వాటి ప్రకారం, రాబోయే యాభై ఏళ్ల తరువాత జరిగే మార్పులకు సంబంధించి వీడియో స్క్రీన్స్ మరియు వర్చువల్ రియలిటి డిస్క్ లను ఏర్పాటు చేయడం జరిగింది. యూరోప్ కు చెందిన ఐదుగురు ప్రముఖ టెక్నలాజికల్ నిపుణులు రూపొందించిన నివేదిక ఆధారంగా ఆ పార్క్ ని ఏర్పాటు చేసింది శాంసంగ్ సంస్థ. ఇక అసలు మ్యాటర్ ఏంటంటే, అందులో వారు పొందుపర్చిన వీడియోలను బట్టి, రాబోయే రోజుల్లో పిల్లలకు స్కూళ్ళు, యువకులకు కాలేజీలు ఉండవని, ఎందుకంటే వారు మెల్లగా ఎదుగుతున్న తీరుని  బట్టి వారి మెదడులో చిన్న చిప్ ల వంటివి అమర్చడంతో వారి వయసుకు తగ్గ డేటా అందులో నిక్షిప్తమై ఉంటుందని, అలానే మెల్లగా పెరిగి వారు కాలేజీ స్థాయికి ఎదగడంతో, ఆ చిప్ లో ఆయా చదువులకు సంబందించి డేటాను ఎప్పటికపుడు మారుస్తూ ఉండడం జరుగుతుందట. అంతేకాక మనం పేపర్ పై రాయడం, టైపింగ్ వంటివి చేయవలసిన అవసరం లేకుండా, 

మనం చెప్పదల్చుకుంది ఎడినా సరే, మన మనసు మరియు ఆలోచనల నుండి నేరుగా ఎదుటివారి మెదడులోకి మెసేజ్ రూపములో చొచ్చుకు పోతుందట. ఇక అన్నిటికంటే ముఖ్యంగా రవాణా వ్యవస్థలో ఊహకు అందని విప్లవాత్మక మార్పులు వస్తాయట. దానిని బట్టి గంటకు 95వేల మైళ్ళ వేగంతో ప్రయాణించగలిగే రీ యూజబుల్ రాకెట్స్ వంటివి రావడంతో, సరదాగా మనం బయటకు వెళ్లినట్లుగా, మరొక గ్రహం పైకి వెళ్ళవచ్చట. అంతేకాక శబ్దం కంటే ఐదు రెట్లు వేగంగా ప్రయాణించే అత్యాధునిక విమానాల రాకతో, ఏకంగా ఇండియా నుండి అమెరికాకు కేవలం ఒక అరగంటలోనే ఇట్టే చేరుకోవచ్చని అంటున్నారు. మరి శాంసంగ్ వారు చెప్తున్నట్లు ఇటువంటివి కనుక భవిష్యత్తులో వస్తే ఇక మనిషి జీవన విధానం మరింత సులభతరం అవుతుందనే చెప్పాలి....!!  


మరింత సమాచారం తెలుసుకోండి: