బాబోయ్ చలి కాలం వచ్చేసింది. వెంటనే లిప్ కేర్, లిప్ బాం తీసుకొచ్చుకోవాలి అని తొందర పడుతుంటారు అమ్మాయిలు. ఎందుకంటే అందమైన ముఖానికి మరింత అందాన్నిచ్చే పెదువులు వాతావరణ మార్పుల వల్ల తరచు పొడిబారిపోతుంటాయి. అయితే ఈ సమస్యను గుర్తించి పెదువులకు ఎప్పటికప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి. 


గులాబీ రేకుల్లా కోమలంగా ఉండాల్సిన పెదువులు గులాబీ ముళ్ళలా మారి తెగ ఇబ్బందిపెడతాయి. పొడి చర్మం ఉన్నవారిలో ఈ మార్పు మరింత స్పష్టంగా కనిపిస్తుంది. అందుకే కోమలమైన, మెరిసే పెదవులు కోరుకునే వారు ఈ కిందా ఉన్న చిట్కాలను పాటిస్తే చాలు. పెదవులు ఎంతో అందంగా కోమలంగా ఉంటాయి. ఆ చిట్కాలు ఏంటో ఇక్కడ చదివి తెలుసుకోండి. 


లేత కీరదోసముక్కతో పెదువులపై తరచూ రుద్ది తగినంత తేమను అందేలా చూడాలి.


పొడిబారి బిరుసెక్కిన పెదవులకు తాజా కలబంద గుజ్జు రాసి తేలిగ్గా మర్దన చేస్తే పెదవులకు తగినంత తేమ సమకూరి మెత్తబడతాయి.


బిరుసెక్కిన పెదాలకు రాత్రి నిద్రకు ముందు కొద్దిగా పేరైన నెయ్యి రాసి మర్దన చేస్తే ఉదయానికి పెదాలు మృదువుగా మారి మెరుస్తాయి.


రోజూ పెదవులకు మీగడ రాసుకుంటే సున్నితంగా,మృదువుగా మారతాయి.


పచ్చి బంగాళ దుంప ముక్కల్నిపెదవులకు రాసుకుంటే పెదవులు మెత్తబడటమే గాక నల్లని పెదవులు కూడా గులాబీ రంగుకు మారతాయి.


పొడిబారిన పెదాలకు లిప్‌స్టిక్‌ రాసే ముందు పాలలో ముంచిన దూదితో పెదాలను తుడిచి లిప్‌స్టిక్‌ రాస్తే పెదవులు నిగారిస్తాయి. 


చూసారుగా ఈ టిప్స్ ని పాటించి మీ పెదాలను అందంగా మచుకోండి.


మరింత సమాచారం తెలుసుకోండి: