మీకు తెలుసా  క్రీస్తుపూర్వం 2900 నుంచీ గంజాయి నూనెను నొప్పి నివారిణిగా వాడేవారు. మనం  మాధక ద్రవ్యంగా చూస్తున్న గంజాయిని కాన్నబిస్ లేదా మారిజువానా మొక్క అని కూడా అంటారు.
నిజానికి గంజాయి మొక్క నుంచీ 104 రకాల రసాయనాల్ని తీస్తారు. వాటన్నింటినీ కలిపి కన్నబినాయిడ్స్ అంటారు. వాటిలో నూనె కూడా ఒకటి.దీన్ని  సైంటిఫిక్ రూపంలో CBD అంటారు. CBD వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉండటంతో... ఔషధాల తయారీలో దాన్ని ఎక్కువగా వాడుతున్నారు. 


మన శరీరంలో ECS విధానం వల్ల నిద్ర, ఆకలి, బాధ, వ్యాధి నిరోధక శక్తి వ్యవస్థలు పని చేస్తాయి.ఈ ECS చక్కగా పనిచెయ్యాలంటే... గంజాయి నూనెతో మసాజ్ చేసుకుంటే సరి. నొప్పి, మంటలు, వాపు వంటివి కూడా తగ్గుతాయి. ఈ నూనె కండరాలకు విశ్రాంతి కలిగిస్తుంది. తలకు మర్దన చేసుకుంటే... నిద్ర బాగా వచ్చేలా చేస్తుంది.ప్రస్తుతం ప్రపంచంలో చాలా మంది డిప్రెషన్, టెన్షన్, ఒత్తిడి, కంగారు, బిజీ లైఫ్ స్టైల్‌తో జీవిస్తున్నారు. సర్వ రోగాలకూ పరోక్ష కారణమయ్యే  ఆతృత(యాంగ్జైటీ) కి నూనెతో మసాజులు, మర్దనల వంటివి చేసుకుంటే, ఎంతో కూల్‌గా, హాయిగా ఉంటుందనీ, టెన్షన్ల నుంచీ ఉపశమనం కలుగుతుందని పరిశోధనల్లో తేలింది. ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా   టెన్షన్ తగ్గించేస్తుందని అంటున్నారు డాక్టర్లు.

కొంతమందికి ఎంతకీ నిద్ర రాక  బెడ్‌పై అదేపనిగా అటూ ఇటూ కదులుతారే తప్ప నిద్రలోకి జారుకోరు.ఇలాంటి వాళ్లు ఈ ఆయిల్‌తో తలకు మర్దన చేసుకుంటే... చక్కగా నిద్ర పట్టి, బ్రెయిన్‌ మత్తులోకి జారుకొని... కలల ప్రపంచంలోకి తీసుకెళ్తుందట. సాధారణంగా కాన్సర్ ఉన్నవారికి వికారంగా, వామ్టింగ్ అయ్యేలా, నొప్పిగా కూడా అనిపిస్తుంది. అలాంటి వారికి ఈ నూనెతో మసాజ్ చేస్తే...నొప్పి నుంచీ రిలీఫ్ కలిగి చాలా ప్రయోజనం ఉంటుందంటున్నారు. కీమోథెరపీ చేయించుకునేవారికి కూడా ఇది ఎంతో మేలు చేస్తోందని తెలిసింది.జన్యుపరమైన కారణాల వల్ల, బ్యాక్టీరియా వల్ల మన చర్మంపై మచ్చలు, మొటిమల వంటివి కామన్ గా  వస్తుంటాయి. ఇందులో ఉండే యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు... మొటిమలు, మచ్చల అంతు చూస్తాయి.

ఇక మతిమరపు లక్షణాలు తగ్గాలంటే ఈ నూనెతో తలకి మసాజ్ చేసుకోవాలి. అల్జీమర్స్, పార్కిన్‌సన్స్ వంటి వ్యాధులతో బాధపడేవారికి కూడా ఈ నూనె మంచి ఫలితాలు చూపిస్తోందని పరిశోధనల్లో తేలింది. హైబీపీ వల్ల గుండె పోటు వచ్చే ప్రమాదం ఉంటుంది. అందువల్ల బీపీ పెరగకుండా ఇలాంటి ఆయిల్స్ వాడితే రిలాక్స్ ఫీల్ కలిగిస్తూ ఉంటే... బీపీ ఆటోమేటిక్‌గా కంట్రోల్‌లో ఉంటుంది.గంజాయి నూనె డయాబెటిస్‌ని తగ్గించడానికి పరిశోధనలు ఎలుకలపై లోతైన చేయగా పరిశోధనల్లో 56 శాతం పాజిటివ్ ఫలితాలు కనిపించాయి. అందువల్ల ఈ నూనెతో షుగర్ వ్యాధి కంట్రోల్‌లో ఉంటుందా లేదా అన్నదానిపై పూర్తిగా స్పష్టత ఇవ్వట్లేదు.గంజాయి నూనె వల్ల కొన్ని సైడ్ ఎఫెక్ట్స్  డయేరియా, ఆకలి ఎక్కువగా వేయడం,కొంతమంది అలసటగా ఉన్నట్లు అనిపిస్తోందని కూడా తెలిపారు. అందువల్ల డాక్టర్ల సలహా తీసుకున్న తర్వాతే ఈ నూనె వాడటం మంచిదంటున్నారు. డాక్టర్ వాడొచ్చంటే మాత్రం చక్కటి ఫలితాలు పొందవచ్చు.


మరింత సమాచారం తెలుసుకోండి: