నోయిడా కు చెందిన ఓ మహిళ తనని హిప్నటైజ్ చేసి అమెజాన్ డెలివరీ బాయ్ అత్యాచారయత్నం చేశాడని పేర్కొంటూ  పోలీసులకు ఫిర్యాదు చేయడం దేశవ్యాప్తంగా కలకలం సృష్టించింది .  వస్తువుల బదిలీ కోసం తన ఇంటికి వచ్చిన అమెజాన్ డెలివరీ బాయ్, తనతో వాగ్వివాదానికి దిగాడని , అతని కళ్ళలోకి చూస్తుండగానే తాను కళ్ళు తిరిగి కిందపడిపోయానని , మెలుకువ వచ్చేసరికి అతడు ప్యాంట్ జిప్ తీసి తన ఎదురుగ నిలబడి ఉండడాన్ని గమనించని బాధిత మహిళ పేర్కొన్న విషయం తెల్సిందే .   అయితే అమెజాన్ డెలివరీ బాయ్ పై  కేసు ను నమోదు చేయడానికి సదరు మహిళ అంగీకరించలేదు. 


అంతేకాకుండా తన ఫిర్యాదును వెనక్కి తీసుకోవడం అనుమానాస్పదంగా మారింది .  ఈ కేసు విచారణ చేపట్టిన నోయిడా సిటీ ఎస్సై వినీత్  జైస్వాల్ మాట్లాడుతూ బాధిత మహిళ ఫిర్యాదు మేరకు  అమెజాన్ డెలివరీ బాయ్ ని పిలిపించి  విచారించామని  చెప్పారు.  తనపై వచ్చిన ఆరోపణలను అతడు  ఖండించాడని పేర్కొన్నాడు.  వస్తువుల ఎక్స్చేంజ్ కోసం బాధితురాలు ఫ్లాట్ కి వెళ్ళినప్పుడు అక్కడ ఇరువురి మధ్య వాగ్వాదం జరిగిందని పేర్కొన్నట్లుగా జైస్వాల్  వెల్లడించారు . దీంతో ఈ కేసును పురోగతి కోసం బాధితురాలిని  వైద్య పరీక్షలు చేయించుకొని కోరామని,  అయితే ఆవిడ వైద్య పరీక్షలు చేయించుకోవడానికి నిరాకరించారని చెప్పారు.  అంతేకాకుండా అమెజాన్ డెలివరీ బాయ్ పై ఇచ్చిన  తన ఫిర్యాదును వెనక్కి తీసుకుంటున్నట్లు  చెప్పారని జైస్వాల్ వివరించారు. 


ఈ ఘటనపై  అమెజాన్ సంస్థ స్పందిస్తూ తమకు కస్టమర్ల భద్రతకే తమకు అత్యంత ప్రధానమైన విషయమని ... అప్పుడప్పుడు ఇలాంటి సంఘటనలు తమను ఇబ్బందులకు గురి చేస్తూ ఉంటాయని చెప్పారు.  విచారణకు సంబంధించి పోలీసులకు తమ వంతుగా పూర్తిగా సహాయ సహకారాలు అందజేస్తామని అమోజాన్ సంస్థ ప్రకటించింది. 

మరింత సమాచారం తెలుసుకోండి: