ఆంధ్ర ప్రదేశ్ లో ఇటీవల 74 ఏళ్ల కు చెందిన ఒక వృద్ధ మహిళ కవల పిల్లలు జన్మించిన సంఘటన మర్చిపోకముందే, తెలంగాణ లో  తాజాగా 52 ఏళ్ల  వయసులో మరో  మహిళ పండంటి కవల పిల్లలకు జన్మనిచ్చిన సంఘటన హాట్ టాఫిక్ గా మారింది .  భద్రాచలం కు చెందిన సత్యనారాయణ,  రమాదేవి దంపతులకు గతం లో ఇద్దరు సంతానం .  కూతురు పెళ్లి చేసుకుని అత్త వారి ఇంటికి వెళ్లి పోగా,  చేతికి అంద వచ్చిన కుమారుడు కొంతకాలం కిందట రోడ్డు ప్రమాదంలో మరణించాడు .


దీంతో ఒంటరయిన  ఆ జంట మళ్ళీ పిల్లల కోసం ప్రయత్నాలు ప్రారంభించింది.  యాభై రెండేళ్ల వయసులో సంక్లిష్టమైన ఆరోగ్య పరిస్థితులు ఉన్న ఆ మహిళ మళ్లీ గర్భం దాల్చి సుఖంగా  ప్రసవించింది. అయితే గర్భం దాల్చడానికి  వయసు మీద పడడంతో ప్రత్యామ్నాయ మార్గం కోసం అన్వేషించి కరీంనగర్ లోని  పద్మజ సంతాన సాఫల్య కేంద్రాన్ని ఆ జంట  సంప్రదించింది . రమాదేవికి బీపీ ఇతర ఆరోగ్య సమస్యలు ఉండడం ఆందోళన చెందినప్పటికీ ,  చివరకు సుఖప్రసవం జరగడం తో అందరు ఊపిరి పీల్చుకున్నారు .  ఇటీవల తూర్పు గోదావరి జిల్లా నెలపర్తిపాడు కు చెందిన రాజారావు , మంగాయమ్మ దంపతులకు కవలలు జన్మించిన విషయం  తెల్సిందే . 


74 ఏళ్ల వయస్సు లో మంగాయమ్మ తల్లికావడం అందర్నీ ఆశ్చర్యానికి గురి చేసింది . ఐ వి ఎఫ్ విధానం ద్వారా తమకు తెలిసిన 55 ఏళ్ల వయసున్న  మహిళ తల్లి  కావడంతో మంగాయమ్మ తల్లి కావాలన్న తన కోర్కెను తీర్చుకునేందుకు గుంటూరులోని ఒక ఆసుపత్రి ని సంప్రదించి , లేటు వయస్సులో కవలలకు జన్మనిచ్చి మాతృత్వ ప్రేమను ఆస్వాదిస్తోంది . ఇక తాజా రమాదేవి కూడా ఐ వి ఎఫ్ విధానం ద్వారా కవలలకు జన్మనిచ్చింది . 

మరింత సమాచారం తెలుసుకోండి: